డబ్బు పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది. కోటీశ్వరులు కావాలని మధ్యతరగతి ప్రజలు కలలు కంటుంటారు. మీ దగ్గర లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టేంత డబ్బు లేకపోయినా కోటీశ్వరులు కావడం (How to become crorepati) కష్టమేమీ కాదు. ఇందుకు ఆర్థిక క్రమశిక్షణ (Financial Discipline) కావాలి. అంటే డబ్బు ఖర్చు చేయడం దగ్గర్నుంచి, పొదుపు చేయడం వరకు ప్రతీ అంశంలో ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మీరు ఒక కోటి రూపాయల సంపద కూడబెట్టడానికి 15x15x15 రూల్ ఉపయోగపడుతుంది. పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ ఈ రూల్ గురించి చెబుతుంటారు. ఈ రూల్ ఫాలో కావడం ద్వారా మీరూ కోటీశ్వరులు కావొచ్చు.
పొదుపు చేసే మొత్తం తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలంటే వార్షికంగా ఎక్కువ శాతం రిటర్న్స్ వచ్చే అసెట్‌లో పొదుపు చేయాలి. ఉదాహరణకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6 శాతం నుంచి 10 శాతం మధ్య ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పొదుపు చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ పొందలేరు. స్టాక్ మార్కెట్‌లో మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. అయితే నిపుణులు ఫండ్‌ను మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి రిస్క్ కొంత తగ్గించుకోవచ్చు. ఇక గోల్డ్, రియల్ ఎస్టేట్ లాంటి పెట్టుబడి మార్గాలు కూడా ఉంటాయి.
IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్
పెట్టుబడి ఆప్షన్స్‌లో ప్రతీ నెలా పొదుపు చేయడానికి కొన్ని ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో రికరింగ్ డిపాజిట్ , మ్యూచువల్ ఫండ్ లాంటివి ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్‌లో రిటర్న్స్ తక్కువగా వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో 15 శాతం రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఎంచుకుంటే మీరు 15x15x15 రూల్‌తో కోటీశ్వరులు కావొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఏ మ్యూచువల్ ఫండ్ భవిష్యత్తులో ఎంత రిటర్న్స్ ఇస్తుందని పక్కాగా అంచనా వేయలేం. కానీ టాప్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌తో మంచి రిటర్న్స్ పొందొచ్చు. మీరు కోటి రూపాయలు పొదుపు చేయడానికి 15 ఏళ్ల పాటు నెలకు రూ.15,000 చొప్పున సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయాలి. వార్షిక రిటర్న్స్ 15 శాతంగా లెక్కిస్తే 15 ఏళ్లలో కోటి రూపాయలు పొదుపు చేయొచ్చు.
Gold Jewellery: ధంతేరాస్, దివాళీకి గోల్డ్ కొన్నారా? బిల్లులో ఈ వివరాలున్నాయా?
ఉదాహరణకు మీరు నెలకు రూ.15,000 చొప్పున ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిప్ చేస్తున్నారనుకుందాం. 15 ఏళ్లలో అంటే 180 నెలల్లో మీరు పొదుపు చేసే మొత్తం రూ.27,00,000 అంటే రూ.27 లక్షలు. 15 ఏళ్ల పాటు ఏటా 15 శాతం రిటర్న్స్ వచ్చినట్టైతే మీకు మొత్తం రూ.1.01 కోట్ల రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు రూ.27 లక్షలు పొదుపు చేస్తే రూ.74 లక్షలు రిటర్న్స్ లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mutual Funds, Personal Finance, Save Money