• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW HOW TO APPLY FOR LEARNER DRIVING LICENSE ONLINE AND OFFLINE IN TELANGANA AND ANDHRA PRADESH SS

Driving License: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి ఇలా

Driving License: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి ఇలా

Driving License: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Driving License | మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు.

  • Share this:
    వాహనం నడపాలంటే మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. లెర్నర్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. లెర్నర్ లైసెన్స్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ సహకారంతో రోడ్లపై వాహనాలు నడుపుతూ డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా మొదట లెర్నర్ లైసెన్స్ తప్పనిసరి. టూవీలర్‌, ఫోర్ వీలర్‌ డ్రైవింగ్ కోసం లైసెన్స్ తీసుకోవచ్చు. అంతకన్నా భారీ వాహనాలు నడపడానికి కూడా లైసెన్స్‌లు ఉంటాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్‌ని జారీ చేస్తుంది. ఈ లైసెన్స్ ఉన్నవారే రోడ్లపై వాహనాలు నడపడానికి అర్హులు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్ట విరుద్ధం.

    డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్‌కి దరఖాస్తు చేయొచ్చు. 16 ఏళ్లు దాటినవారు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్‌కి దరఖాస్తు చేయొచ్చు. మోటార్ సైకిల్ ఇంజిన్ కెపాసిటీ కూడా 55 సీసీ కన్నా తక్కువ ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల డిక్లరేషన్ తప్పనిసరి. 18 ఏళ్లు దాటినవాళ్లు ట్రాన్స్‌పోర్ట్ వాహనం కాకుండా ఇతర వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేయొచ్చు. ఇక ట్రాన్స్‌పోర్ట్ వాహనం నడపడానికి లైసెన్స్ కావాలంటే వయస్సు 20 ఏళ్లు దాటాలి.

    mAadhaar App: ఎంఆధార్ యాప్ ఉందా? 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు ఇలా

    Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... లాక్‌డౌన్ తర్వాత ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభం

    డ్రైవింగ్ లైసెన్స్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్


    వయస్సు ధృవీకరణ కోసం పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్
    అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్. ఇతర ప్రాంతాలకు చెందినవారైతే హౌజ్ రెంట్ అగ్రిమెంట్ ఇవ్వాలి.
    లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
    పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
    ఫామ్ 1, 1ఏతో పాటు ప్రభుత్వ వైద్యులు సర్టిఫై చేసిన మెడికల్ సర్టిఫికెట్

    ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేయాలి


    డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలంటే సంబంధిత రాష్ట్రానికి చెందిన రవాణా శాఖ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    తెలంగాణకు చెందిన వారు https://www.transport.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు https://www.aptransport.org/html/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
    ఏజ్, అడ్రస్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి.
    లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్ కూడా బుక్ చేయొచ్చు.

    BSNL Broadband Plans: ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారా? కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

    SBI: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకుకు వెళ్లకుండానే ఈ సర్వీస్ పొందొచ్చు

    ఆఫ్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేయాలి


    దగ్గర్లోనే ఆర్‌టీఓ ఆఫీసులో దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి.
    దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.
    ఆర్‌టీఓ కార్యాలయంలో దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
    లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కోసం అధికారులు స్లాట్ కేటాయిస్తారు.
    టెస్ట్ పాస్ అయిన తర్వాత లెర్నర్ లైసెన్స్ పర్మనెంట్ అడ్రస్‌కు వస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు