మీకు ట్రాఫిక్ చలాన్లు ఎక్కువగా వస్తున్నాయా? మీరు ప్రయాణిస్తున్న రూట్‌లో ట్రాఫిక్ పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తున్నారా? అయితే ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి ఓ చిన్న పనిచేస్తే చాలు. ట్రాఫిక్ చలాన్లు (Traffic Challan) చాలావరకు తప్పించుకోవచ్చు. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో పాటు మీ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) మీ దగ్గర భద్రపర్చుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు అడిగినా వీటిని చూపిస్తే చాలు. అయితే ఇలాంటి డాక్యుమెంట్స్ వాహనంలో తీసుకెళ్లడం ప్రతీసారి కుదరకపోవచ్చు. అందుకే మొబైల్ యాప్‌లో వీటిని భద్రపర్చుకోవచ్చు. ఇలాంటి డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజీలాకర్ (Digilocker) ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు.
డిజీలాకర్ యాప్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవచ్చు. మీకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో సేవ్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్‌ని అధికారికంగా ఎక్కడైనా చూపించొచ్చు. మీరు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ కలెక్టర్‌కు, లేదా వాహనం నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులకు ఈ డాక్యుమెంట్స్ డిజీలాకర్ యాప్‌లో చూపించొచ్చు. మరి డిజీలాకర్ యాప్‌లో డాక్యుమెంట్స్ ఎలా సేవ్ చేయాలో తెలుసుకోండి.
IRCTC Tatkal Ticket: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం కొత్త యాప్
Step 1- ముందుగా https://www.digilocker.gov.in/ వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ యాప్ ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఫోన్ నెంబర్, ఇతర వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
Step 4- మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
Step 5- భవిష్యత్తులో లాగిన్ చేయడానికి ఎంపిన్ క్రియేట్ చేయాలి.
Step 6- అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకు డిజీలాకర్ అకౌంట్‌ను లింక్ చేయాలి.
Step 7- ఆ తర్వాత Pull Partner’s Document సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 8- మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి డ్రైవింగ్ లైసెన్స్‌ను డిజీలాకర్ యాప్‌లో సేవ్ చేయొచ్చు.
ఇలాగే మీ వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వెహికిల్ ఇన్స్యూరెన్స్, ఇతర డాక్యుమెంట్స్ డిజీలాకర్‌లో సేవ్ చేయొచ్చు. ప్రతీ యూజర్ 1జీబీ స్పేస్ వరకు డాక్యుమెంట్స్ సేవ్ చేయొచ్చు. డిజీలాకర్‌లో సేవ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతించాలని, ఏదైనా ప్రభుత్వ ప్రక్రియలో వీటిని ఉపయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఉన్నాయి.
IRCTC: తిరుపతి వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీలో హోటల్ రూమ్ బుక్ చేయండి ఇలా
డిజీలాకర్ ప్లాట్‌ఫామ్‌ను 10 కోట్లకు పైగా యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 4.94 బిలియన్ల డాక్యుమెంట్స్‌ని జారీ చేయడం విశేషం. 1783 సంస్థలు డాక్యుమెంట్స్ జారీ చేస్తున్నాయి. డిజీలాకర్‌లో 568 రకాల డాక్యుమెంట్స్ సేవ్ చేయొచ్చు. వీటిలో టాప్ 10 లో ఆధార్ కార్డ్, పాలసీ డాక్యుమెంట్స్ పాన్ వెరిఫికేషన్ రికార్డ్, ఇన్స్యూరెన్స్ పాలసీ, వెహికిల్ రిజిస్ట్రేషన్, రేషన్ కార్డ్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, వెహికిల్ ట్యాక్స్ రిసిప్ట్, ఎల్‌పీజీ సబ్‌స్క్రిప్షన్ వోచర్, యూఏఎన్ కార్డ్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digilocker, Driving licence, TRAFFIC AWARENESS, Traffic challan