• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW HOW TO ADD DRIVING LICENCE TO DIGILOCKER APP AND DOWNLOAD SOFT COPY SS

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Driving Licence | మీరు మీ డ్రైవింగ్ లైెసెన్స్ సాఫ్ట్ కాపీ డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? డిజీలాకర్ యాప్ ద్వారా చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. లైసెన్స్ తీసుకుంటే వాహనం నడిపే సమయంలో లైసెన్స్ కాపీ వాహనదారుడి వెంట ఉండాలి. గతంలో జేబులో లేదా వాహనంలో లైసెన్స్ క్యారీ చేయాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ పద్ధతుల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాంటి కాపీలను చూపించొచ్చు. ఇందుకు అనుమతి ఉంది. డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకొని సాఫ్ట్ కాపీ స్మార్ట్‌ఫోన్‌లో దాచుకుంటే చాలు. స్మార్ట్‌ఫోన్‌లో ఇవి ఉంటే మీరు ప్రత్యేకంగా ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాహనదారులకు ఈ సమస్య ఉండకూడదనే ప్రభుత్వం డిజిటల్ కాపీలను అనుమతిస్తున్నాయి. ఫిజికల్ కాపీ తీసుకెళాల్సిన అవసరం లేదు కాబట్టి అవి పోతాయన్న టెన్షన్ కూడా ఉండదు.

    Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

    Most Expensive Bikes: ఇండియాలో లభిస్తున్న కాస్ట్‌లీ బైక్స్ ఇవే... ధర ఎంతో తెలుసా?

    డిజీలాకర్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, ఆరు అంకెల పిన్ ద్వారా లాగిన్ కావాలి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీ ఆధార్ నెంబర్‌ను డిజీలాకర్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ చేసిన తర్వాత Get Issued Documents పైన క్లిక్ చేయాలి. అందులో డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఏ రాష్ట్రంలో తీసుకుంటే ఆ రాష్ట్రానికి చెందిన రవాణా శాఖకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఎంటర్ చేసి Get Document పైన క్లిక్ చేయాలి.

    JioFiber Free Trial: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ వివరాలివే

    SBI Loans: ఎస్‌బీఐలో లోన్ ఇస్తామని ఫోన్ వచ్చిందా? అయితే అలర్ట్

    రవాణా శాఖ సర్వర్ నుంచి మీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్ మీ డిజీలాకర్ అకౌంట్‌లోకి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీని కూడా మీరు ఇక్కడి నుంచే డౌన్‌లోడ్ చేయొచ్చు. మీరు డిజీలాకర్ యాప్ ఉపయోగించకూడదు అనుకుంటే mParivahan యాప్ ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీ పొందొచ్చు. ప్రాసెస్ దాదాపు ఇదే విధంగా ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు