SBI: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్‌... ఇలా యాక్టివేట్ చేసుకోండి

SBI: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్‌... ఇలా యాక్టివేట్ చేసుకోండి

SBI SMS Alerts | ఎస్ఎంఎస్ అలర్ట్‌తో మీ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం అంటే పాస్‌వర్డ్ మార్చినప్పుడు, ఎక్కడైనా లాగిన్ అయినప్పుడు తెలుస్తుంది. మీ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ వస్తాయి.

  • Share this:
    మీ బ్యాంక్ అకౌంట్‌ సురక్షితంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. అకౌంట్‌లో మీ డబ్బు జాగ్రత్తగా ఉండాలంటే మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం ఎస్ఎంఎస్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా కాగానే ఎస్ఎంఎస్‌ వచ్చేలా అలర్ట్ సర్వీస్ యాక్టివేట్ చేసుకుంటే మంచిది. మీరు డబ్బులు డ్రా చేసినప్పుడు పర్లేదు కానీ, ఎవరైనా మీకు తెలియకుండా మీ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేస్తే వెంటనే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అంతేకాదు... ఎస్ఎంఎస్ అలర్ట్‌తో మీ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం అంటే పాస్‌వర్డ్ మార్చినప్పుడు, ఎక్కడైనా లాగిన్ అయినప్పుడు తెలుస్తుంది. మీ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే ఎస్ఎంఎస్ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం కూడా సాధ్యమే. మరి ఎస్‌బీఐ అకౌంట్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోండి.

    Read this: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... ఆఫర్లు ఇవే

    ఎస్‌బీఐలో ఎస్ఎంఎస్ అలర్ట్స్‌ యాక్టివేట్ చేసుకోండి ఇలా


    ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.onlinesbi.com ఓపెన్ చేయండి.
    మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
    ఇ-సర్వీసెస్‌లో సెక్షన్‌లో "SMS alerts" పైన క్లిక్ చేయాలి.
    తర్వాతి స్టెప్‌లో "SMS alerts registration/updation" పేజీ కనిపిస్తుంది.
    అందులో కావాల్సిన సమాచారాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. ఎస్‌బీఐలో ఎస్ఎంఎస్ అలర్ట్స్‌ యాక్టివేట్ అవుతుంది.

    Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో



    ఇవి కూడా చదవండి:

    PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

    Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా

    IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
    First published: