One Crore: 12 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా ? ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

గత వారం AMFI ప్రచురించిన జూలై నెల ఆస్తుల నిర్వహణ (AUM) డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది.

  • Share this:
రిటైల్ పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్‌కు బాగా ఆకర్షితులవుతున్నారు. త్వరగా ఆర్థిక ప్రయోజనాలు పొంది రిటైర్ అయ్యేందుకు ఈ పెట్టుబడిదారులు ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) రూపంలో తక్కువ మొత్తంలో నగదు పెట్టుబడిగా పెట్టి అధిక ఆర్థిక వృద్ధి సాధించేందుకు మొగ్గు చూపుతున్నారు. గత వారం AMFI ప్రచురించిన జూలై నెల ఆస్తుల నిర్వహణ (AUM) డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది.

మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఖాతాల ఆస్తుల విలువ జులై నెలలో రూ.5 లక్షల కోట్లు దాటింది. ఈ స్థాయిలో పెరగడానికి రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలలో మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యమైన భాగంగా మారడమేనని తెలుస్తోంది. ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే అధిక లాభాలు పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నలభై ఏళ్లు దాటిన వ్యక్తులు ఇప్పటికీ రిటైర్మెంట్ కోసం డబ్బును ఆదా చేయకపోయినా ఫర్వాలేదు అంటున్నారు. వారంతా SIP రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పెట్టుబడి పెట్టి.. రాబోయే 10-12 సంవత్సరాలలో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

* రూ.1కోటి ఎలా సంపాదించవచ్చు?
ఎస్ఐపిల రూపంలో పెట్టుబడులు పెట్టి 12ఏళ్ల వ్యవధిలోనే క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ నుంచి 12% రాబడిని ఆశించవచ్చు. 12% రాబడితో కోటి రూపాయలు జమ చేయాలంటే వచ్చే 12 ఏళ్లలో ఎస్ఐపిలలో ప్రతి నెలా రూ.31,342 పెట్టుబడి పెట్టాలి. ఇంత మొత్తంలో డబ్బులు పొదుపు చేయలేకపోతే, స్టెప్-అప్ SIP మార్గాన్ని ఎంచుకోవాలి. దీనిద్వారా మీరు చిన్న మొత్తంతో పెట్టుబడులు పెడుతూ.. మీ ఎస్ఐపిల పెట్టుబడిని నిర్ణీత శాతంతో క్రమంగా పెంచాలి. మీ ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం నిర్ణీత స్థాయిలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయించుకోవాలి. 12 ఏళ్లలో రూ.1 కోటి మీ బ్యాంకు ఖాతాలో ఉండాలంటే.. రూ.20,680 పెట్టుబడితో ప్రారంభించి ప్రతియేటా 10% పెంచాలి.

డబ్బు మొత్తాన్ని ఒకే ఫండ్‌లో పెట్టడం కంటే కొన్ని ఇండెక్స్ ఫండ్‌లతో సహా 3-4 డైవర్సిఫైడ్ ఈక్విటీ MF స్కీమ్‌లను ఎంపిక చేసుకోవాలి. 12 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు కాబట్టి మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్‌లతో పాటు సెక్టార్ ఫండ్‌లను ఎంపిక చేసుకోకండి.

ఎస్ఐపి పెట్టుబడులకు ఉత్తమ ఎంపికలు:

1. కెనరా రోబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్

2. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ (ELSS)

3. మీరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్

4. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్

5. హెచ్‌డిఎఫ్‌సీ/ ఐసీఐసీఐ / ఎస్‌బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్
Published by:Kishore Akkaladevi
First published: