Home /News /business /

KNOW HOW STATE BANK OF INDIA CUSTOMERS CAN ACTIVATE CONTACTLESS PAYMENT ON THEIR DEBIT CARD SS

SBI ATM Card: పిన్ నెంబర్ అవసరం లేకుండా ఏటీఎం కార్డుతో పేమెంట్స్... మీరూ యాక్టివేట్ చేయండి ఇలా

SBI ATM Card: పిన్ నెంబర్ అవసరం లేకుండా ఏటీఎం కార్డుతో పేమెంట్స్... మీరూ యాక్టివేట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI ATM Card: పిన్ నెంబర్ అవసరం లేకుండా ఏటీఎం కార్డుతో పేమెంట్స్... మీరూ యాక్టివేట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI ATM Card | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు తమ దగ్గరున్న డెబిట్ కార్డుతో (Debit Card) పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకోసం కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఫీచర్ యాక్టివేట్ చేయాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు బ్యాంకు మరో ఫీచర్ అందిస్తోంది. సాధారణంగా షాపులో పాయింట్ ఆఫ్ సేల్ (pos) మెషీన్లలో కార్డు స్వైప్ చేసి పేమెంట్స్ చేయాలంటే పిన్ తప్పనిసరి. ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే ఓటీపీ తప్పనిసరి. పీఓఎస్ మెషీన్లలో పిన్ నెంబర్ అవసరం లేకుండా పేమెంట్స్ చేయడానికి కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ (Contactless Debit Card) అందిస్తోంది ఎస్‌బీఐ. కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పీఓఎస్ మెషీన్‌కు దగ్గరగా కార్డు ట్యాప్ చేస్తే చాలు. పేమెంట్ జరిగిపోతుంది. ఈ పేమెంట్స్ చేయడానికి ఎస్‌బీఐ గ్లోబల్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ అందిస్తోంది. ఇందులో ఉండే ఈఎంవీ చిప్ అదనపు సెక్యూరిటీ అందిస్తుంది.

కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ యాక్టివేట్ చేసిన తర్వాత పీఓఎస్ టెర్మినల్‌లో ఈజీగా పేమెంట్స్ చేయొచ్చు. కార్డు స్వైప్ చేయడం, పిన్ నెంబర్ ఎంటర్ చేయడం లాంటివి అవసరం లేకుండా క్షణాల్లో పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు షాపుల్లో ఉండే అన్ని పీఓఎస్ మెషీన్స్‌లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ స్వీకరించే ఫీచర్ ఉంది. చిన్నచిన్న పేమెంట్స్ చేసేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. మరి మీ దగ్గర కూడా కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ఉంటే ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి.

ICICI Monsoon Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్


కస్టమర్లు SMS SWON NFC CCCCC ఫార్మాట్‌లో 09223966666 నెంబర్‌కు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. వారి డెబిట్ కార్డుకు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ ఫీచర్ యాక్టీవ్ అవుతుంది. CCCCC అంటే వారి డెబిట్ కార్డులోని చివరి ఐదు అంకెలు అని అర్థం చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా కాంటాక్ట్‌లెస్ పేమెంట్ ఫీచర్ యాక్టీవేట్ చేయొచ్చు. ఇందుకోసం కస్టమర్లు ముందుగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత మెనూలో E-services సెక్షన్‌లో ATM card services సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్, కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసి NFC Usage ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.

How to Withdraw Money From PF Account Online: మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా డ్రా చేయండి ఇలా

మీరు పీఓఎస్ మెషీన్లలో రూ.5,000 లోపు జరిపే పేమెంట్స్‌కి పిన్ ఆప్షన్ కనిపించదు. కార్డ్ ట్యాప్ చేస్తే పేమెంట్ జరిగిపోతుంది. ఒక రోజులో గరిష్టంగా 5 కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. గరిష్టంగా రూ.5,000 వరకు మాత్రమే పేమెంట్స్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ లేకపోతే మీ బ్యాంక్ బ్రాంచ్‌లో అప్లై చేయాలి. లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.



కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ తీసుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ కార్డు ఎప్పుడూ మీ దగ్గరే ఉండేలా జాగ్రత్తపడాలి. ఎట్టిపరిస్థితుల్లో ఈ కార్డు ఎవరికీ ఇవ్వకూడదు. మీ డెబిట్ కార్డులో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ యాక్టివేట్ అయి ఉంటే, మీ కార్డు పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Atm Card, Debit card, Personal Finance, Sbi, State bank of india

తదుపరి వార్తలు