Home /News /business /

KNOW HOW SBI CUSTOMERS CAN FILE INCOME TAX RETURNS WITH YONO APP HERE IS THE DETAILS AK GH

SBI: ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. యోనో యాప్​ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే ఛాన్స్.. పూర్తిగా ఉచితం

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

ఎస్​బీఐ కస్టమర్లు ఎటువంటి రుసుము చెల్లించకుండానే యోనో యాప్​ ద్వారా ఐటీ రిటర్న్​​ దాఖలు చేయవచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. తమ కస్టమర్లు ఉచితంగానే ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఎస్​బీఐ ఈ తరహా సేవల కోసం టాక్స్​ 2 విన్​ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఎస్​బీఐ కస్టమర్లు ఎటువంటి రుసుము చెల్లించకుండానే యోనో యాప్​ ద్వారా ఐటీ రిటర్న్​​ దాఖలు చేయవచ్చు. ఈ మేరకు ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ‘‘మీరు ఐటీర్​ను దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఎస్​బీఐ యోనో యాప్​ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా కేవలం 5 డాక్యుమెంట్లు మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ మొబైల్​లో యోనో యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోండి. ఉచితంగా ఐటీ రిటర్న్​ దాఖలు చేయండి.’’ అని పేర్కొంది. అయితే, ఈ ఆఫర్​ అక్టోబర్​ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

యోనో యాప్ ద్వారా ఐటిఆర్ దాఖలకు కావాల్సిన డాక్యుమెంట్లు

1) పాన్ కార్డ్

2) ఆధార్ కార్డు

3) ఫారం -16

4) పన్ను మినహాయింపు వివరాలు

5) వడ్డీ ఆదాయ ధృవీకరణ పత్రాలు

6) పన్ను ఆదా కోసం టాక్స్​ సేవింగ్​ డిపాజిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు

ఎస్​బీఐ కస్టమర్లు యోనో యాప్​ ద్వారా తమ ఐటీఆర్​ ఫైల్ చేయాలంటే కొన్ని స్టెప్స్​ అనుసరించాలి. అవేంటో చూద్దాం.

ముందుగా SBI YONO యాప్​లోకి లాగిన్ అవ్వండి.
‘షాప్స్​ అండ్​ ఆర్డర్స్' ఆప్షన్​ను ఎంచుకోండి.
‘ట్యాక్స్​ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​’ ఆప్షన్​లోకి వెళ్లండి. అక్కడ కనిపించే ‘ట్యాక్స్ 2 విన్’​పై క్లిక్​ చేయండి.
ఆ తర్వాత మీకు ఐటీఆర్​కు సంబంధించిన మొత్తం సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఆ స్టెప్స్​ను ఫాలో అవుతూ ఐటీఆర్​ను సులభంగా దాఖలు చేయవచ్చు.

Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

డిసెంబర్​ 31 వరకు అవకాశం..
కాగా, గత నెలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (CBDT) ఐటీఆర్​ ఫైలింగ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2020–21ఆర్థిక సంవత్సరానికి గాను 2021 డిసెంబర్ 31 వరకు ఐటీర్​ దాఖలు చేయవచ్చు. దేశంలో కరోనా వైరస్​ విజృంభనతో పన్ను చెల్లింపులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: ITR, Yono

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు