Home /News /business /

KNOW HOW ROADSIDE ASSISTANCE ADD ON COVER OR INSURANCE POLICY RESCUE IF YOUR CAR BREAKS DOWN IN MONSOON SS

Roadside Assistance: వర్షంలో రోడ్డుపై కార్ ఆగిపోయిందా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఫ్రీ సర్వీస్

Roadside Assistance: వర్షంలో రోడ్డుపై కార్ ఆగిపోయిందా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఫ్రీ సర్వీస్
(ప్రతీకాత్మక చిత్రం)

Roadside Assistance: వర్షంలో రోడ్డుపై కార్ ఆగిపోయిందా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఫ్రీ సర్వీస్ (ప్రతీకాత్మక చిత్రం)

Roadside Assistance | ఇన్స్యూరెన్స్ కంపెనీలు వాహనదారులకు పలు రకాల ఇన్స్యూరెన్స్ కవరేజీలు ఆఫర్ చేస్తుంటాయి. అలాంటి వాటిలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (Roadside Assistance) కవర్ కూడా ఒకటి.

కారులో వెళ్తుంటే సడెన్‌గా రోడ్డుపై వాహనం ఆగిపోవడం, వర్షంలో ప్రయాణిస్తుంటే దారిలోనే కార్ బ్రేక్ డౌన్ (Car Break Down) కావడం సాధారణంగా చూస్తుంటాం. సొంత ఊళ్లో ఇలాంటి సమస్య ఎదురైతే తెలిసిన వారి సాయంతో కారును ఎలాగోలా షెడ్డుకో, ఇంటికో తీసుకెళ్తుంటారు. కానీ దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు కొత్త ప్రాంతంలో ఇలాంటి సమస్య ఎదురైతే ఇబ్బందులు తప్పవు. రాత్రి సమయాల్లో లేదా భారీ వర్షంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమయంలోనే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (Roadside Assistance) సర్వీస్ ఆదుకుంటుంది. అసలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అంటే ఏంటీ? ఈ సర్వీస్ ఎలా పొందాలి? ఎలాంటి సేవలు కవర్ అవుతాయి? తెలుసుకోండి.

ఇన్స్యూరెన్స్ కంపెనీలు కాంప్రహెన్సీవ్ కార్ ఇన్స్యూరెన్స్ కవర్‌తో పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్ కూడా ఇస్తుంది. వాహనదారులు ఈ యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు. ఇందుకోసం అదనంగా కాస్త డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వాహనం ఎప్పుడైనా దారిలో ఆగిపోయినప్పుడు, ఇతర సమస్యలు ఎదురైనప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ద్వారా సాయం పొందొచ్చు.

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలో కాదో సింపుల్‌గా ఇలా వెరిఫై చేయండి

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీ తీసుకున్నవారు సాయం కోసం ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాల్ చేయాలి. ఇన్స్యూరెన్స్ కంపెనీ సహాయకుల్ని స్పాట్‌కి పంపిస్తుంది. చాలావరకు సేవలన్నీ ఉచితంగా లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దారిలో పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయితే పెట్రోల్ కొనడానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం ఆగిపోతే తోసుకెళ్లడానికి డబ్బులు ఇవ్వాలి

కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రయాణంలో ఆటంకం ఎదురుకాకుండా ట్యాక్సీ సదుపాయం కల్పిస్తాయి. అవసరమైతే హోటల్‌లో వసతిని కూడా అందిస్తాయి. దూరప్రాంతాలకు వాహనాల్లో తరచూ వెళ్లేవారికి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది.

LIC Policy: ఎల్ఐసీ నుంచి పెన్షన్ పాలసీ... ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే రూ.12,000 పెన్షన్

రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌లో అన్నీ కవర్ కావు. బ్యాటరీ సమస్యలు, ఫ్లాట్ టైర్ సమస్యలు, స్పేర్ కీ లేకపోవడం, టోయింగ్ సర్వీస్, చిన్నచిన్న రిపేర్లు... ఇలా కొన్ని సేవలు కవర్ కావు. అందుకే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్ తీసుకునేప్పుడు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి. కారు వయస్సును బట్టి సర్వీస్ మారుతూ ఉంటుంది. యాన్యువల్ ఛార్జీలు అధికంగా ఉంటాయి. ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి. ఏడాదిలో ఎన్ని సర్వీసులు ఉచితంగా లభిస్తాయో తెలుసుకోవాలి. అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అందించే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్ వివరాలు, ప్రీమియం పోల్చి చూసుకోవాలి.

తరచూ కారులో ఎక్కువ దూరం ప్రయాణించేవారు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ తీసుకుంటే మంచిది. ఇప్పటికే మీరు చెల్లిస్తున్న ఇన్స్యూరెన్స్ పాలసీలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీ ఉంటే ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు తప్పనిసరిగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అవసరం అవుతుందని అనుకుంటే ఈ పాలసీ తీసుకోవచ్చు. కారు వయస్సు ఐదేళ్లు దాటినట్టైతే కాంప్రహెన్సీవ్ కార్ ఇన్స్యూరెన్స్ పాలసీతో పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచిది.



ఇన్స్యూరెన్స్ కంపెనీ, లభించే సేవల్ని బట్టి ప్రీమియం రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది. కార్లకు మాత్రమే కాదు, బైకులకు కూడా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం రూ.1,000 లోపే ఉంటుంది. అయితే బైకుల కన్నా కార్లకే ఎక్కువగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీ తీసుకుంటూ ఉంటారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Cars, Insurance

తదుపరి వార్తలు