• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW HOW REAL TIME GROSS SETTLEMENT WORKS AND DIFFERENCE BETWEEN RTGS AND NEFT SS GH

RTGS: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆర్‌టీజీఎస్ గురించి ఈ విషయాలు తెలుసా?

RTGS: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆర్‌టీజీఎస్ గురించి ఈ విషయాలు తెలుసా?

RTGS: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆర్‌టీజీఎస్ గురించి ఈ విషయాలు తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

RTGS | మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు పంపుతున్నారా? అసలు ఆర్‌టీజీఎస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

  • Share this:
ఈ రోజుల్లో అన్ని రకాల ఆర్థిక సేవల కోసం ప్రజలు డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, థర్డ్‌ పార్టీ పేమెంట్ యాప్స్‌ వంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు బ్యాంకులు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలున్నాయి. NEFTలో నిర్ధిష్ట సమయంలో నమోదైన లావాదేవీలు బ్యాచ్‌ల వారీగా ప్రాసెస్ అవుతాయి. RTGSలో మాత్రం రోజంతా లావాదేవీలు నిరంతరాయంగా ప్రాసెస్ అవుతాయి. గత డిసెంబర్ 14 నుంచి ఈ సేవలను ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ ద్వారా ఈ సేవలను యాక్సెస్ చేయవచ్చు. సంబంధిత బ్యాంకు మొబైల్ యాప్స్‌లో లాగిన్ అయిన తరువాత RTGS విధానంలో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందా?


RTGS ట్రాన్సాక్షన్లపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఛార్జీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ విధానంలో ఇన్‌వర్డ్ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండే అవుట్‌వర్డ్ ట్రాన్సాక్షన్లపై కేవలం రూ.24.5 వరకు ఛార్జీలు ఉండవచ్చు. రూ.5 లక్షలు దాటిన ట్రాన్సాక్షన్లపై రూ.49.5 వరకు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. వీటికి కొన్ని బ్యాంకులు ట్యాక్స్‌ కూడా విధిస్తాయి. కానీ రిజర్వు బ్యాంక్ నిర్దేశించిన రేట్లకంటే ఎక్కువ ఛార్జీలలను బ్యాంకులు వసూలు చేయవు.

PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

New Rules from April 1: సామాన్యులకు అలర్ట్... రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే

ఎలాంటి వివరాలు అవసరం?


RTGS రెమిటెన్స్ కోసం ఖాతాదారుడు బ్యాంకులకు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. రెమిట్ చేయాల్సిన మొత్తం, డెబిటింగ్ అకౌంట్ నంబర్, లబ్ధిదారుడి బ్యాంకు బ్రాంచి, రిసీవింగ్ బ్రాంచ్ IFSC కోడ్, లబ్ధిదారుడి పేరు, అకౌంట్ నంబరు.. వంటి వివరాలు అందించాలి.

RTGS ఫండ్ ట్రాన్స్‌ఫర్ లాభాలు


ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసే ఇతర మార్గాలతో పోలిస్తే RTGS వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ట్రాన్సాక్షన్లకు మెరుగైన భద్రత, భరోసా ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ చేసే గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితులు ఉండవు. దీంతోపాటు ఇరవై నాలుగు గంటలూ RTGS సదుపాయం అందుబాటులో ఉంటుంది. బ్యాంకు చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ అవసరం లేకుండా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రెమిటెన్స్ ప్రారంభించవచ్చు. దీనికి తోడు లబ్ధిదారుడు పేపర్ ఇనుస్ట్రుమెంట్లను డిపాజిట్ చేయడానికి బ్యాంకు బ్రాంచికి వెళ్లాల్సిన అవసరం లేదు. ట్రాన్సాక్షన్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్లకు చట్టపరమైన రక్షణ కూడా ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు