ప్రధానమంత్రి జన్ ధన్ యోజన-PMJDY ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పలు పథకాల నిధుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన-PM Kisan స్కీమ్‌లో భాగంగా రైతులకు రూ.2,000, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా 20 కోట్లకు పైగా మహిళల జన్ ధన్ అకౌంట్లకు రూ.500 చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. వీటితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు బదిలీ చేశాయి. మరి ఈ అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా లేదా అని లెక్కలు తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గత రెండు నెలల లెక్కలు చూస్తే లబ్ధిదారులు వారానికి రూ.2000 కోట్లకు పైనే విత్‌డ్రా చేస్తున్నారని తేలింది. ఏప్రిల్, మే నెలల్లో ఎనిమిది వారాల డేటాను గమనిస్తే జన్ ధన్ అకౌంట్ల నుంచి భారీగా బ్యాలెన్స్ తగ్గిపోయింది. ఇందుకు కారణం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోవడంతో అకౌంట్ హోల్డర్లు జన్ ధన్ ఖాతాల్లోని డబ్బుల్ని విత్‌డ్రా చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు సాయం చేయకముందు 2020 ఏప్రిల్ 1న జన్ ధన్ ఖాతాల్లో రూ.1,19,680 కోట్ల బ్యాలెన్స్ ఉండేది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగిస్తూ ఉండటంతో ఈ బ్యాలెన్స్ తగ్గిపోయింది. ఏప్రిల్ మధ్యలో రూ.1,33,564 కోట్లు, ఏప్రిల్ చివరికి రూ.1,29,000 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ మే 13 నాటికి రూ.1,36,000 కోట్లు, మే 27 నాటికి రూ.1,31,000 కోట్లకు బ్యాలెన్స్ పెరిగింది. అంటే మే నెలలో వచ్చిన డబ్బుల్ని ఇంకా విత్‌డ్రా చేసుకోకపోవడం వల్ల బ్యాలెన్స్ తగ్గలేదు. ఏప్రిల్ నుంచి మాత్రం జన్ ధన్ ఖాతాదారులు వరుసగా డబ్బుల్ని విత్‌డ్రా చేస్తున్నారు. మరి మీకు కూడా జన్ ధన్ ఖాతాలో డబ్బులు వచ్చినట్టైతే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Good News: జన్ ధన్ ఖాతాలోకి డబ్బులు... ఎవరికి ఎప్పుడంటే
PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా
SBI: సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన ఎస్‌బీఐ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Banking, Personal Finance, PM Kisan Scheme, Pradhan Mantri Jan Dhan Yojana, Pradhan Mantri Kisan Samman Nidhi