హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cash Rules: మీ ఇంట్లో ఎంత క్యాష్ ఉంది? ఈ రూల్ తెలుసా?

Cash Rules: మీ ఇంట్లో ఎంత క్యాష్ ఉంది? ఈ రూల్ తెలుసా?

Cash Rules: మీ ఇంట్లో ఎంత క్యాష్ ఉంది? ఈ రూల్ తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Cash Rules: మీ ఇంట్లో ఎంత క్యాష్ ఉంది? ఈ రూల్ తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Cash Rules | నగదు లావాదేవీలు జరిపేవారికి కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరపాలి. సరిగ్గా లెక్కలు చూపించకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

డిజిటల్ లావేదేవీలు (Digital Transactions) ఎక్కువగా జరిపేవారికి నగదుతో పెద్దగా అవసరం ఉండదు. పెద్దమొత్తంలో లావాదేవీలు కూడా డిజిటల్ పద్ధతుల్లో చేయొచ్చు. అయితే కేవలం డిజిటల్ లావాదేవీలపైనే ఆధారపడకుండా క్యాష్ మెయింటైన్ చేసేవాళ్లు ఉంటారు. ఎమర్జెన్సీకి అవసరం ఉంటుందని ఇంట్లో కొంత నగదు ఎప్పుడూ దాచుకుంటారు. అయితే ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? ఒకరి ఇంట్లో ఎంతమొత్తం క్యాష్ మెయింటైన్ చేయొచ్చని? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇంట్లో నగదు దాచుకోవడానికి లిమిట్ ఏమీ లేదు. అంటే ఎంతైనా నగదు దాచుకోవచ్చు. అయితే ఒకవేళ ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సదరు వ్యక్తి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంట్లో ఉన్న నగదు, ఇంట్లో వ్యక్తుల ఆదాయానికి తగినట్టుగా ఉండాలి. వేలల్లో జీతం పొందుతున్న వ్యక్తి ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉంటే అనుమానించాల్సిందే.

PAN Aadhaar Link: గుడ్ న్యూస్... పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఒకవేళ భారీగా నగదు ఉన్నట్టైతే ఆ నగదుకు లెక్కలు చెప్పాలి. ఇంట్లో ఉన్న నగదుకు, చెప్పిన లెక్కలకు తేడా ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి చర్యలు తప్పవు. అలాంటి సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నగదు సీజ్ చేస్తారు. మొత్తం నగదులో 137 శాతం ఫైన్ కూడా చెల్లించమని ఆదేశిస్తారు. ఇవే కాదు నగదు లావాదేవీలకు సంబంధించి మరిన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

ఏదైనా రుణం లేదా డిపాజిట్ కోసం రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరించడానికి ఏ వ్యక్తికి అనుమతి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిపితే, అందుకు తగ్గ లెక్కలు చూపించకపోతే జరిమానా విధించబడుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ ప్రకారం, ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ నెంబర్ అవసరం.

Pension Scheme: 3 రోజుల్లో ఈ స్కీమ్‌లో చేరితే రూ.18,500 పెన్షన్

ఒక ఖాతాదారుడు ఒక సంవత్సరంలో రూ.20 లక్షల నగదును డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ సమాచారాన్ని వెల్లడించాలి. రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు ద్వారా ఆస్తుల కొనుగోలు లేదా విక్రయం జరిపినట్టైతే దర్యాప్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్-డెబిట్ కార్డ్ చెల్లింపు సమయంలో, ఒక కార్డుదారుడు ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ నగదు చెల్లిస్తే సదరు వ్యక్తిపై విచారణ ఉంటుంది. బంధువుల నుంచి ఒక్కరోజులో దాదాపు రూ.2 లక్షల నగదు తీసుకోకూడదు. బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరపాలి.

First published:

Tags: Cash, Currency, Income tax, Personal Finance

ఉత్తమ కథలు