KNOW HOW DEBIT AND CREDIT CARD CAN ALSO BE INSURED MK
ఆన్ లైన్ మోసాలతో జాగ్రత్త...మీ డెబిట్, క్రెడిట్ కార్డులకు బీమా చేయించుకోండిలా....
(ప్రతీకాత్మక చిత్రం)
డెబిట్ క్రెడిట్ కార్డును కూడా బీమా చేయవచ్చా అని...అయతే మీరు విన్నది నిజమే....ఎంతో విలువైన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను ఆన్ లౌన్ మోసాల నుంచి రక్షించడానికి, ఇలాంటి సమస్యలను నివారించడానికి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు.
నేటి కాలంలో, డెబిట్ క్రెడిట్ కార్డును కూడా బీమా చేసుకోవడం చాలా అవసరం. అసలే ఆన్ లైన్ షాపింగుల జోరు మొదలైంది. ముఖ్యంగా కరోనా దెబ్బతో ఆన్ లైన్ లోనే షాపింగ్ లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే దాంతో పాటు ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగాయి. ఇలాంటి సందర్భంలోనే డెబిట్, క్రెడిట్ కార్డులు భీమా చేయించుకోవడం చాలా అవసరం. మీకు సందేహం రావచ్చు... డెబిట్ క్రెడిట్ కార్డును కూడా బీమా చేయవచ్చా అని...అయతే మీరు విన్నది నిజమే....ఎంతో విలువైన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను ఆన్ లౌన్ మోసాల నుంచి రక్షించడానికి, ఇలాంటి సమస్యలను నివారించడానికి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు.
కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ గురించి తెలుసుకోండి...
అన్నింటిలో మొదటిది, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇది ఒక రకమైన కార్డ్ ఇన్సూరెన్స్. ఇందులో క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డులతో పాటు స్టోర్స్, లాయల్టీ, ఆధార్, పాన్ కార్డులు కూడా బీమా కిందకు వస్తాయి. అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు రక్షణ ప్రణాళికలను అందిస్తున్నాయి. చిన్న వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రొటెక్షన్ ప్లాన్ పొందవచ్చు. ఒక వేళ మీ పర్సు పోయిన తరువాత, మీరు ప్రతి కార్డుకు వేర్వేరు బ్యాంకులకు కాల్ చేయవలసిన అవసరం లేదు. ఒకే కాల్ తో అన్ని కార్డులు ఒకేసారి బ్లాక్ చేస్తారు. ఇది సరైన సమయంలో కార్డును బ్లాక్ చేయడానికి సహాయపడుతుంది.
(ప్రతీకాత్మక చిత్రం)
కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద కవరేజీ లాభాలు ఇవే..
- ప్రయాణ సమయంలో మీ పర్స్ పోయినట్లయితే, ఈ ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా మీ హోటల్ ఖర్చును చెల్లించవచ్చు.
- ఇది మాత్రమే కాదు, ఈ పరిస్థితిలో టిక్కెట్లు కూడా కోల్పోతే, బదులుగా కొత్త టికెట్ పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది.
- అయితే ఈ సేవలు బ్యాంకుల పథకాలపై కూడా ఆధారపడి ఉంటాయి.
- ముందస్తు నగదులో కూడా సిపిపి సహాయపడుతుంది. మీరు దేశంలోనే ప్రయాణిస్తున్నప్పుడు ఈ సేవ ప్రత్యేకంగా సహాయపడుతుంది.
- మీరు సహాయం పొందిన 28 రోజుల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
(ప్రతీకాత్మక చిత్రం)
మీరు ఎక్కడ ప్లాన్ పొందవచ్చో తెలుసుకోండి మరియు ధర ఎంత
- ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు మొదలైన వాటికి కూడా బీమా కవరేజి ఉంటుంది.
- ఇవి కాకుండా, మీ మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా, ఈ ప్లాన్ సహాయంతో మీరు ఫిర్యాదు చేయవచ్చు.
- కార్డ్ ప్రొటెక్షన్ కంపెనీ, బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులు ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి ఈ ప్రణాళికను పొందవచ్చు.
-ఈ ప్రణాళిక కోసం మీరు ఏటా 1,600 నుండి 2,500 రూపాయలు చెల్లించాలి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.