KNOW HOW BSNL BBNL MERGER WILL IMPACT ON INDIA RURAL CONNECTIVITY AK GH
BSNL BBNL Merge: బీఎస్ఎన్ఎల్, బీబీఎన్ఎల్ విలీనంతో గ్రామీణ ప్రాంతాలకు మేలు.. ఎలాగంటే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)లో మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్(BBNL)ను పూర్తిగా వీలినం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విలీనం వల్ల గ్రామీణ ప్రాంతాలను మెరుగైన టెలికాం సేవలు, కనెక్టివిటీ పెరుగుతాయి.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)లో మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్(BBNL)ను పూర్తిగా వీలినం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విలీనం వల్ల గ్రామీణ ప్రాంతాలను మెరుగైన టెలికాం సేవలు, కనెక్టివిటీ పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో BSNL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మాట్లాడుతూ.. BBNL వీలిన ప్రక్రియతో బీఎస్ఎన్ఎల్ను ఒక మలుపు తిప్పే అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. బీబీఎన్ఎల్ పూర్తి బాధ్యతలు బీఎస్ఎన్ఎల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు.
బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది. 2021 జులైలో దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యతను పూర్తిగా బీబీఎన్ఎల్ కు అప్పగించింది. అందుకోసం సుమారు రూ. 24 వేల కోట్లను వెచ్చించారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో 1.71 లక్షల గ్రామ పంచాయతీలను భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అనుసంధానం చేశారు. అయితే ఇప్పటికే పలు ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ నెట్‌వర్క్‌తో పాటుగా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్లో బీఎస్ఎన్ఎల్కు భారీగా లబ్థి చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
బీఎస్ఎన్ఎల్కు ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది. బీబీఎన్ఎల్ విలీన ప్రతిపాదనతో బీఎస్ఎన్ఎల్కు మరో 5.67 లక్షల కిలోమీటర్ల ఓఎఫ్సీ అందుబాటులోకి వస్తుంది. దేశంలో 1.85 లక్షల గ్రామ పంచాయతీలు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(USOF) కింద ఈ కేబుల్ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యాయి. 2012లోనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఉపయోగించి దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి, అన్ని టెలికాం ఆపరేటర్లతో కలిసి యాక్సెస్‌ను అందించడం కోసం నిర్ణయం తీసుకున్నారు. టెలికాం ఆపరేటర్లు టెలికాం సేవల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై 8 శాతం లైసెన్స్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో యూఎస్ ఓఎఫ్(USOF) కోసం 5 శాతం లెవీ కూడా ఉంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో తమ టెలికాం సేవల ద్వారా రూ.17,000 కోట్ల ఆదాయాన్ని అధిగమించే అవకాశం ఉందని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. ఇది 2020-21 ఆదాయం రూ.17,452 కోట్లతో పోలిస్తే తక్కువే. 2019 -20లో బీఎస్ఎన్ఎల్ రూ.15,500 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, 2020-21లో నష్టాన్ని రూ.7,441 కోట్లకు పరిమితం చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇంచుమించు ఇదే మొత్తంలో నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే వచ్చే కొన్ని నెలల్లో నాణ్యమైన 4జీ సేవలను వినియోగదారులకు అందించడం ద్వారా ఖాతాదారులను నిలబెట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఈ విలీనం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మరింత వేగంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుతాయని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌కు సహకరిస్తారని, ఇది వివక్ష లేకుండా అన్ని కంపెనీలకు గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అందిస్తుందని అధికారులు చెప్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.