LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో లాభాలివే...

LIC New Jeevan Anand Plan | పాలసీ గడువు మొత్తం ప్రీమియం చెల్లించిన వారికి మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది. ఆ తర్వాత కూడా బీమా కొనసాగుతుంది.

news18-telugu
Updated: March 28, 2019, 1:42 PM IST
LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో లాభాలివే...
LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో లాభాలివే...
news18-telugu
Updated: March 28, 2019, 1:42 PM IST
జీవన్ ఆనంద్ పాలసీ... లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తీసుకొచ్చిన ఈ ప్లాన్ చాలా పాపులర్. పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. ఆ పాలసీలో కొన్ని మార్పులు చేసి ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకొచ్చింది ఎల్ఐసీ. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ ఎండోమెంట్ పాలసీ. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌తో పోలిస్తే ఎండోమెంట్ ప్లాన్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎండోమెంట్‌లో మీకు బీమా ప్రయోజనాలతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ బెనిఫిట్స్ కూడా లబిస్తాయి. టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలో అయితే బీమా ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.

Read this: SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే

LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ వివరాలివే...



వయస్సు: 18 నుంచి 50 ఏళ్లు.
కనీస బీమా: రూ.1 లక్ష, గరిష్ట పరిమితి లేదు.


పాలసీ టర్మ్: 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లు.
ప్రీమియం: నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి.
Loading...
లోన్: మూడేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత లోన్ సదుపాయం.
సరెండర్: మూడేళ్లు పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ సదుపాయం.
ట్యాక్స్ బెనిఫిట్: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే సొమ్ముపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు.

Read this: LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే

LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ బెనిఫిట్స్


పాలసీ గడువు మొత్తం ప్రీమియం చెల్లించిన వారికి మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది. ఆ తర్వాత కూడా బీమా కొనసాగుతుంది. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత నామినీకి సమ్ అష్యూర్డ్ లభిస్తుంది.

ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ చెల్లిస్తుండగా మరణిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు

Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడిందా? ఇలా చేయండి

TRAI Good news: సెటాప్ బాక్స్ మార్చకుండా మరో ఆపరేటర్‌కు మారొచ్చు
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626