Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం (ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan | మీరు గోల్డ్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ దగ్గరున్న బంగారాన్ని తాకట్టుపెట్టి గట్టెక్కాలనుకుంటున్నారా? అయితే గోల్డ్ లోన్ తీసుకునేముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం.

 • Share this:
  గోల్డ్ లోన్ తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోకపోతే మీరు తాకట్టు పెట్టిన బంగారానికి తక్కువగా లోన్ వచ్చే అవకాశముంటుంది. దీని వల్ల మీకే నష్టం. ప్రస్తుతం బంగారం ధర సుమారు రూ.50,000 దగ్గరుంది. గతంలో మీరు తాకట్టు పెట్టే బంగారం విలువలో 75 శాతం మాత్రమే లోన్ వచ్చేది. దీన్నే లోన్ టు వ్యాల్యూ రేషియో-LTV రేషియో అంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని కొద్ది రోజుల క్రితం తీసుకుంది. బ్యాంకులు బంగారం విలువలో 90 శాతం వరకు రుణాలు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. 2021 మార్చి 31 వరకు ఈ రూల్ వర్తిస్తుంది. అంటే మీరు గతంలో తీసుకున్న రుణం కన్నా ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు మీరు రూ.1,00,000 విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే గతంలో రూ.75,000 వరకు మాత్రమే రుణం వచ్చేది. అంతకన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు రూ.90,000 వరకు లోన్ తీసుకోవచ్చు. అంటే రూ.15,000 అదనంగా మీరు రుణం పొందొచ్చు.

  iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా

  SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

  బంగారంపై రుణాలు తీసుకునే ముందు ఈ ఒక్క విషయం మాత్రమే కాదు వడ్డీ రేట్లను కూడా చూసుకోవాలి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు గోల్డ్ లోన్స్ ఇస్తుంటాయి. అయితే వేర్వేరు చోట వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి. రుణం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అన్న లెక్క మాత్రమే కాకుండా వడ్డీ ఎక్కువా తక్కువా అన్నది కూడా చూసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అతి తక్కువగా 7.50 శాతం, కెనెరా బ్యాంక్ 7.65 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో 9.90 నుంచి 11.5 శాతం వడ్డీ ఉంటుంది. ఇక మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి ఎన్‌బీఎఫ్‌సీలు 12 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఈ వడ్డీ మాత్రమే కాదు... 1.5 శాతం + జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ ఛార్జీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లెక్కేసుకొని గోల్డ్ లోన్ ఎక్కడ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.

  గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మీ బంగారం ఆభరణాలు, ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ లేదా పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ లేదా టెలిఫోన్ బిల్, ఫోటోలు తీసుకెళ్లాలి. ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు బంగారు ఆభరణాలను, గోల్డ్ కాయిన్స్‌ని తాకట్టు పెట్టొచ్చు. అయితే బ్యాంకుల్లో కొన్న గోల్డ్ కాయిన్స్‌కే లోన్స్ ఇస్తాయి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు. జ్యూవెలరీ షాపులో కొన్న కాయిన్స్‌కు గోల్డ్ లోన్ తీసుకోలేరు. ఆర్‌బీఐ పాలసీ ప్రకారం ఒక కస్టమర్ గరిష్టంగా 50 గ్రాముల వరకు గోల్డ్ కాయిన్స్‌ని తాకట్టు పెట్టొచ్చు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం మీ బంగారాన్ని లెక్కించి అందులో 90 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కనీసం రూ.20,000 నుంచి రూ.25,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. మూడు నెలల నుంచి 36 నెలల వరకు ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు.

  Dussehra Special Trains: ప్రయాణికులకు శుభవార్త... దసరా ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించిన సౌత్ సెంట్రల్ రైల్వే

  Flash Sale: ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే

  మీరు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మీ బంగారు ఆభరణాలను తాకట్టు పెడతారు. అయితే పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో ఆభరణాలు కావాలంటే ఎలా అన్న సందేహం కస్టమర్లలో ఉంటుంది. రుణం మొత్తం చెల్లిస్తేగానీ రుణాలు రావన్న అనుమానం ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం తాత్కాలికంగా ఆభరణాలను వెనక్కి ఇస్తాయి. మీరు ఆభరణాలు తాకట్టు పెట్టేముందు ఈ విషయం కనుక్కోండి. మీరు తీసుకున్న రుణాన్ని ముందే చెల్లిస్తే నామినల్ క్లోజర్ ఫీజు 2 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది.

  ఇక చివరగా గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది అన్న అనుమానం కూడా ఉంటుంది కస్టమర్లకు. లోన్ చెల్లించాలని బ్యాంకులు కస్టమర్లను సంప్రదిస్తాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇక కస్టమర్లు లోన్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే నిబంధనల ప్రకారం ఆభరణాలను సీజ్ చేసి వేలం నిర్వహిస్తాయి. ఈ పరిస్థితి వస్తే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్‌పై దుష్ప్రభావం ఉంటుంది.
  Published by:Santhosh Kumar S
  First published: