• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • KNOW ABOUT THREE OPTIONS AFTER PUBLIC PROVIDENT FUND PPF ACCOUNT MATURITY SS GH

PPF Deposits: మెచ్యూరిటీ తర్వాత కూడా పీపీఎఫ్ రిటర్న్స్ పొందొచ్చు

PPF Deposits: మెచ్యూరిటీ తర్వాత కూడా పీపీఎఫ్ రిటర్న్స్ పొందొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

PPF Deposits | మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశారా? మెచ్యూరిటీ తర్వాత మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ ఎంచుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
కరోనా వల్ల స్తంభించిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు భారత్‌ చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అయినా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPFలో పెట్టుబడులు మాత్రం తగ్గట్లేదు. ఇది పెట్టుబడిదారులకు మంచి డెట్ ప్రొడక్ట్‌గా ఉపయోగపడుతోంది. దీంట్లో చేసే పెట్టుబడులకు ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. నష్టభయం కూడా ఉండదు. ఈపీఎఫ్‌లో నమోదు చేసుకోని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నేరుగా PPFలో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. PPF పెట్టుబడులకు 15 సంవత్సరాల మెచూరిటీ ఉంటుంది. ఆ తరువాత వచ్చే మొత్తాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై చాలామందికి అవగాహన ఉండదు. పీపీఎఫ్ మెచూరిటీ ముగిసిన తరువాత కస్టమర్లు మూడు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అవేంటంటే...

1. PPF అకౌంట్‌ను మూసివేయడం


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను సులభంగా మూసివేయవచ్చు. 15 సంవత్సరాల ఇనీషియల్ బ్లాక్ పీరియడ్ ముగిసిన తర్వాత ఈ అకౌంట్‌ను మూసివేసి PPF రాబడి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి రాదు.

PM Kisan: రైతుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్... అప్లై చేయండి ఇలా

LPG Cylinder: సామాన్యులకు షాక్... భారీగా పెరిగిన సిలిండర్ ధర

2. అదనపు డిపాజిట్లు లేకుండా PPF అకౌంట్‌ను పొడిగించడం


PPF అకౌంట్ మెచూరిటీని ఐదేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. అంటే 15ఏళ్ల మెచూరిటీ ముగిసిన తరువాత మరో ఐదేళ్లు పీపీఎఫ్‌ను పొడిగించుకోవచ్చు. ఈ కాలంలో కస్టమర్లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా వడ్డీని పొందవచ్చు. అకౌంట్‌లో ఉండే కార్పస్ ఫండ్‌పై వినియోగదారులకు వడ్డీ క్రెడిట్ అవుతూనే ఉంటుంది. తమ అవసరాల కోసం ఈ ఐదేళ్ళలో వినియోగదారులు కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

3. అదనపు పెట్టుబడులతో PPF అకౌంట్‌ను ఐదేళ్లకు పొడిగించడం


ఈ ఆప్షన్‌లో కస్టమర్లు అదనంగా డిపాజిట్లు చేస్తూ ఐదేళ్ల వరకు పీపీఎఫ్‌ అకౌంట్‌ను పొడిగించుకోవచ్చు. వినియోగదారులు ప్రతి సంవత్సరం కంట్రిబ్యూషన్స్ చేయాలి. ఇది కనీసం రూ.500, అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నట్లు వినియోగదారులు పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. లేదంటే వారు కంట్రిబ్యూషన్స్ లేకుండా పీపీఎఫ్‌ అకౌంట్‌ మెచూరిటీని పొడిగించే రెండో ఆప్షన్‌నే పరిగణిస్తారు. ఆ తరువాత ఇందులో చేసే డిపాజిట్లపై వడ్డీ కూడా రాదు. ఈ ఐదేళ్ల గడువులోపు కస్టమర్లు డబ్బును కొంత వరకు withdrawal చేసుకోవచ్చు. అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్‌లో 60 శాతాన్ని కస్టమర్లు తీసుకునే అవకాశం ఉంది.

Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు

ఏది మంచి ఆప్షన్‌?


15ఏళ్ల మెచూరిటీ తరువాత PPF అకౌంట్‌ను ఐదు సంవత్సరాల బ్లాక్‌గా ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. అంటే PPF అకౌంట్ మెచూరిటీ 20, 25, 30... సంవత్సరాలకు కూడా పెంచుకోవచ్చు. మొదటిసారి డిపాజిట్ చేసిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత నుంచి మొదటి 15ఏళ్ల మెచూరిటీని లెక్కిస్తారు. PPF మెచూరిటీ తరువాత డబ్బు అవసరం లేదని భావిస్తే.. అకౌంట్‌ను పొడిగించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి కూడా రాదు. తక్కువ వయసులో పీపీఎఫ్‌ పెట్టుబడులను ఎంచుకున్నవారు అకౌంట్‌ను పొడిగించుకోవడం వల్ల లబ్ధి పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: