Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

New Rules for reserved passengers | వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్‌ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకునేందుకు 'వెయిట్‌లిస్ట్ ప్రెడిక్షన్' ఫీచర్ వాడుకోవచ్చు.

news18-telugu
Updated: April 21, 2019, 12:43 PM IST
Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...
Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...
news18-telugu
Updated: April 21, 2019, 12:43 PM IST
రైల్వే ప్రయాణికులకు సేవలు అందించే విషయంలో భారతీయ రైల్వే ఎన్నో మార్పులు చేస్తోంది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుకింగ్ దగ్గర్నుంచి సీటులో కూర్చున్న తర్వాత భోజనం వడ్డించే వరకు సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త చర్యలు తీసుకుంటోంది ఇండియన్ రైల్వే. ముఖ్యంగా రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికులకు సేవలు అందించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. వారికి మేలు చేసే మార్పుల్ని అమలు చేస్తోంది. భారతీయ రైల్వే ఇటీవల తీసుకున్న ఐదు మార్పులేంటో..? అవి మీకు ఏ విధంగా ఉపయోగపడ్తాయో తెలుసుకోండి.

1. రిజర్వేషన్ చార్ట్స్: రిజర్వేషన్ చార్టులన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది రైల్వే. రైలులో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ప్రయాణికులు తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు... రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడకుండా టికెట్ల జారీ విధానాన్ని మరింత పారదర్శకం చేసింది. చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత రైలులో ఏ బోగీలో ఏ బెర్త్ ఖాళీగా ఉందో ప్రయాణికులు తెలుసుకోవచ్చు. రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్, 30 నిమిషాల ముందు రెండో చార్ట్ ఆన్‌లైన్లో కనిపిస్తుంది. రిజర్వేషన్ చార్టులో ఏవైనా ఖాళీ బెర్తులు ఉంటే వాటి కోసం ప్రయాణికులు టీటీఈని సంప్రదించొచ్చు. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో కూడా చార్టులు చూడొచ్చు.

Waitlist prediction tool, IRCTC reserved passengers, Vikalp scheme, IRCTC rules new, IRCTC News, Hand-Held Terminals,   Indian Railways new rules, IRCTC train reservation charts, IRCTC PNR linking, indian railways Aadhaar verification,   ఐఆర్‌‌సీటీసీ న్యూ రూల్స్, రైల్వే న్యూ రూల్స్, ఐఆర్‌సీటీసీ రిజర్వేషన్ చార్ట్స్, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్, వికల్ప్ స్కీమ్, వెయిట్‌లిస్ట్ ప్రెడిక్షన్ టూల్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ   ఆధార్ వెరిఫికేషన్, రైలు రిజర్వేషన్
ప్రతీకాత్మక చిత్రం


2. వెయిట్ లిస్ట్ ప్రెడిక్షన్, వికల్ప్ స్కీమ్: గతేడాది ఐఆర్‌సీటీసీ పోర్టల్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత అందుబాటులోకి వచ్చిన రెండు ఫీచర్లు ఇవి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్‌ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకునేందుకు 'వెయిట్‌లిస్ట్ ప్రెడిక్షన్' ఫీచర్ వాడుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్లను ఎంచుకోవడానికి వికల్ప్ స్కీమ్ ఉపయోగపడుతుంది.



3. హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్: రైళ్లల్లో టీటీఈల దగ్గర హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్(HHT) కనిపిస్తాయి. కదులుతున్న రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల్ని రైల్వే ప్రయాణికులకు రైలులోనే కేటాయించే కొత్త వ్యవస్థ ఇది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందొచ్చు. వెయిట్‌లిస్టెడ్, ఆర్ఏసీ టికెట్ హోల్డర్ల బెర్తులు కన్‌ఫామ్ చేసేందుకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ ఉపయోగపడ్తాయి.

Indian Railways, irctc new rules, IRCTC train reservation charts, IRCTC reserved passengers, Waitlist prediction tool, Vikalp scheme, indian railways, Hand-Held Terminals, IRCTC PNR linking, indian railways Aadhaar verification, irctc Aadhaar verification, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ రిజర్వేషన్ చార్ట్స్, వెయిట్‌లిస్ట్ ప్రెడిక్షన్ టూల్, వికల్ప్ స్కీమ్, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్, ఐఆర్‌సీటీసీ ఆధార్ వెరిఫికేషన్

4. ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ లింకింగ్: ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త విధానం ఇది. రెండు రైళ్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు కనెక్టింగ్ రైల్ మిస్సైతే ప్రయాణికులకు రీఫండ్ లభిస్తుంది. ఇందుకోసం పీఎన్ఆర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రైలు ఆలస్యంగా రావడం వల్ల రెండో రైలు మిస్ అయితేనే రీఫండ్ లభిస్తుంది. ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రయాణికులు రీఫండ్ పొందొచ్చు. రైలు దిగిన మొదటి మూడు గంటల్లో టికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది.
Loading...
5. ఆధార్ వెరిఫికేషన్: మీరు ఒక నెలలో ఆరు కన్నా ఎక్కువ టికెట్లు పొందాలంటే ఇండియన్ రైల్వేస్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. ఆధార్ వెరిఫై చేస్తే ఒక నెలలో 12 టికెట్ల వరకు పొందొచ్చు.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...