KNOW ABOUT THEREE POST OFFICE SCHEMES THAT OFFER MORE THAN 7 PERCENT INTEREST RATES VB
Post Office Best 3 Schemes: పోస్టాఫీసులో పెట్టుబడికి 3 అద్భుత పథకాలు.. 7 శాతంపైనే వడ్డీ.. వివరాలిలా..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచిన దగ్గర నుంచి ఇదే ధోరణి కనపడుతోంది. గత నెల ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచగా.. ఈ నెల లో మరో 50 బేసిస్ పాయింట్లను పెంచింది. ప్రస్తుతం రెపోరేటు 4.90 శాతానికి పరిమితం అయింది.
ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై(Fixed Deposits) వడ్డీ రేట్లను(Interest Rates) పెంచుతున్నాయి. ఆర్బీఐ రెపో రేటును(Repo Rate) పెంచిన దగ్గర నుంచి ఇదే ధోరణి కనపడుతోంది. గత నెల ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు(Basis Points) పెంచగా.. ఈ నెల లో మరో 50 బేసిస్ పాయింట్లను పెంచింది. ప్రస్తుతం రెపోరేటు 4.90 శాతానికి పరిమితం అయింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు(Public Sector Banks) అయిన ఎస్బీఐతో(SBI) పాటు ప్రైవేట్ బ్యాంకులు(Private Banks) ఐసీఐసీఐ(ICICI), హెచ్డీఎఫ్సీ(HDFC), యాక్సెస్ బ్యాంక్, పీఎన్బీ, బీఓబీ వంటి బ్యాంకులు తమ ఎఫ్డీలపై(FD) వడ్డీ రేట్లను(Interest Rates) పెంచుతున్నాయి. దీంతో వినియోగదారులు ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే వీటి కంటే కూడా.. పోస్టాఫీసు అందించే మూడు పథకాలు ఎక్కువ లభదాయకంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
సుకన్య సమృద్ధి యోజన (SSY)..
ఆడపిల్ల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన పథకం ఇది. దీని ద్వారా అధిక వడ్డీ లభిస్తోంది. దీనిని 10 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఈ ఖాతాను పోస్టాఫీసుల్లో తెరవొచ్చు. ప్రస్తతం దీని ద్వారా 7.60 శాతం వడ్డీ లభిస్తోంది. దీనిలో సంవత్సరానికి రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయాలి. 15 సంవత్సరాల వరకు ఇలా చేస్తే.. ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF)..
15 ఏళ్ల కాలపరిమితితో దీర్ఘకాలికి పెట్టుబడులకు ఈ పథకం అనువైనది. కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దీనిలో 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత వడ్డీతో పాటు.. అసలును విత్ డ్రా చేసుకోవచ్చు. వాటిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ అత్యవసరం అయితే ఖాతా తెరిచిన 3వ సంత్సరం తర్వాత రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏడో సంవత్సరం నుంచి పాక్షిక విత్ డ్రాలను చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)..
సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించిన పథకం ఇది. ప్రభుత్వ హామీతో పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్న పథకం SCSS. దీనిలో దేశ రక్షణ సిబ్బందిగా పని చేసి 50 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 55 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు వారు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు ఇందులో చేరవచ్చు. దీనిలో రూ.వెయ్యి నుంచి రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ లభిస్తోంది. 5 ఏళ్ల కాలపరిమితితో ఉంటుంది. దీనిలో వడ్డీ 3 నెలలకోసారి చెల్లిస్తారు. పై మూడు పథకాలతో పోలిస్తే బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.