దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,(Anant Ambani) పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో(Radhika Merchant) ఈరోజు నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో రోకా లేదా నిశ్చితార్థ వేడుక జరిగింది. ముఖేష్ అంబానీ,(Mukesh Ambani) ఆయన భార్య నీతా అంబానీల చిన్న కుమారుడైన అనంత్ అంబానీ 1995లో జన్మించారు. అనంత్ అంబానీ USలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంతకుముందు ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
ఇక అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది అంబానీల పెట్టుబడికి కీలకమైన ప్రాంతం. అనంత్ అంబానీ తన తల్లి నీతా అంబానీతో కలిసి కుటుంబ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీ జియో ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) డైరెక్టర్‌గా నియమించబడ్డారు.
Anant Ambani: ఘనంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం
Anant Ambani: రాధికా మర్చంట్‌ను పెళ్లిచేసుకోనున్న అనంత్ అంబానీ
ఇక పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం వరకు విస్తరించిన కొత్త ఇంధన వ్యాపారానికి.. రిలయన్స్ రూపురేఖలనే మార్చగల సామర్థ్యం ఉందని ముకేశ్ అంబానీ ఇటీవల వ్యాఖ్యానించారు. అనంత్ నేతృత్వంలోని ఈ కొత్త తరం వ్యాపారం.. జామ్‌నగర్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేగంగా విస్తరించనుదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.