KNOW ABOUT THE MOTORCYCLES UNDER RS 70000 TVS JUPITER HERO PLEASURE AND SOME OTHERS AK GH
Year Ender 2021: కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా?.. రూ. 70 వేలలోపు లభిస్తున్న బెస్ట్ స్కూటర్లపై ఓ లుక్కేయండి
ప్రతీకాత్మక చిత్రం
వచ్చే ఏడాది వాహన ధరలు పెరగనున్నాయి. కాబట్టి, మీరు కొత్త టూవీటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనడం మంచిది. ప్రస్తుతం, రూ. 70 వేలలోపు లభిస్తున్న టాప్ స్కూటర్లపై ఓ లుక్కేయండి.
మరికొద్ది రోజుల్లో 2021 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి నూతన ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2021లో వాహన అమ్మకాలు పుంజుకున్నాయి. అన్ని వాహనాల్లో కెల్లా టూవీలర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. అయితే వచ్చే ఏడాది వాహన ధరలు పెరగనున్నాయి. కాబట్టి, మీరు కొత్త టూవీటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనడం మంచిది. ప్రస్తుతం, రూ. 70 వేలలోపు లభిస్తున్న టాప్ స్కూటర్లపై ఓ లుక్కేయండి.
టీవీఎస్ జూపిటర్
టీవీఎస్ లైనప్‌లో జూపిటర్ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. టీవీఎస్ జూపిటర్ ప్రారంభ వేరియంట్ రూ. 68,401 ధర వద్ద లభిస్తుంది. ఇక, టాప్ వేరియంట్ రూ. 78,595 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ మొత్తం 5 వేరియంట్లు, 13 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 109.7 సీసీ బీఎస్6 ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 7.37 బీహెచ్పీ వద్ద 8.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు, వెనుక వైపు రెండు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించింది. ఈ జూపిటర్ స్కూటర్ బరువు 107 కిలోలు ఉంటుంది. ఇది 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది.
హీరో ప్లెజర్ ప్లస్
హీరో ప్లెజర్ ప్లస్ మొత్తం 5 వేరియంట్లు, 9 కలర్లలో లభిస్తుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.73,775 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. హీరో ప్లెజర్ ప్లస్ 110.9cc బీఎస్6 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు, వెనుక భాగాల్లో రెండు డ్రమ్ బ్రేక్‌లను అమర్చింది. ఇది 104 కిలోల బరువు ఉంటుంది. ఇది 4.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది.
హోండా డియో
హోండా డియో భారతీయ యువతలో అత్యంత ఆదరణ పొందిన స్కూటర్‌గా నిలిచింది. ఇది 3 వేరియంట్లు, 8 కలర్లలో అందుబాటులో ఉంటుంది. దీని టాప్ వేరియంట్ రూ. 74,217 ధర వద్ద లభిస్తుంది. హోండా డియోలోని 109.51 సీసీ బీఓస్ 6 ఇంజన్ 7.65 బీహెచ్పీ పవర్, 9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో రెండు డ్రమ్ బ్రేక్‌లతో కూడిన కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చింది. ఈ డియో స్కూటర్ 105 కిలోల బరువు ఉంటుంది. ఇది 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది.
హీరో మాస్ట్రో ఎడ్జ్
హీరో మాస్ట్రో ఎడ్జ్ మొత్తం 5 వేరియంట్లు, 8 కలర్లలో అందుబాటులో ఉంటుంది. దీని టాప్ వేరియంట్ రూ. 73,730 ధర వద్ద లభిస్తుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110.9 సీసీ బీఎస్6 ఇంజన్‌తో వస్తుంది. ఇది 8 బీహెచ్పీ పవర్, 8.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు, వెనుక వైపు రెండు డ్రమ్ బ్రేక్‌లతో కూడిన కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చింది. ఈ మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ 112 కిలోల బరువు ఉంటుంది. ఇది 5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.