Home /News /business /

KNOW ABOUT THE INCOME TAX BENEFITS AVAILABLE FOR EDUCATION LOAN HERE IS THE DETAILS AK GH

Tax Benefits in Education: ఉన్నత విద్యకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా? ఈ ప్రయోజనాలు ఉంటాయనే విషయం తెలుసా ?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పాఠశాల, కళాశాల, వర్సిటీలు లేదా మరేదైనా విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వారి కోసం అందుబాటులో ఉంటుంది. విద్యకు సంబంధించిన ఖర్చులు మాత్రమే ఇందులో కవర్ అవుతాయి. కాబట్టి కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, క్లాసులకు ఈ డిడక్షన్స్ వర్తించవు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం మన దేశంలో నాణ్యమైన విద్య ఖరీదైనదిగా మారింది. పన్ను చెల్లింపుదారులకు (Tax Payers) ఇది అదనపు భారమవుతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. పన్ను చెల్లింపుదారులకు విద్య కోసం చేసే ఖర్చుల విషయంలో కొన్ని ఉపశమనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో విద్యకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల కింద లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

* ఫుల్ టైం ఎడ్యుకేషన్ ఖర్చులకు సెక్షన్-80సీ ప్రకారం డిడక్షన్
ఈ సెక్షన్ ప్రకారం ప్రతి ఏడాది ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు కింద రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే భారత్‌లో ఫుల్ టైం ఎడ్యుకేషన్ చేసేవారికి మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, పీపీఎఫ్, హోంలోన్ రీపేమెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తదితర విషయాల్లో ఈ ప్రయోజనాలు అందుతాయి. పాఠశాల, కళాశాల, వర్సిటీలు లేదా మరేదైనా విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వారి కోసం అందుబాటులో ఉంటుంది. విద్యకు సంబంధించిన ఖర్చులు మాత్రమే ఇందులో కవర్ అవుతాయి. కాబట్టి కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, క్లాసులకు ఈ డిడక్షన్స్ వర్తించవు.

కేవలం ట్యూషన్ ఫీజు, ఇతర చెల్లింపులకు మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అదికూడా కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి కూడా పని చేస్తున్నట్లయితే మిగిలిన వారికి కూడా మినహాయింపు పొందవచ్చు. కరెస్పాండెన్స్ కోర్సు చేసేవారికి వర్తించదు. కేవలం భారత్ లో ఉండే వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. భారత్ కు వెలుపల ఉండేవారు మినహాయింపు పొందలేరు.

* విద్యారుణంపై వడ్డీ చెల్లింపునకు మినహాయింపు..
ఉన్నత విద్య కోసం రుణం తీసుకుంటే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్-80ఈ ప్రకారం ఆ లోన్‌పై చెల్లించే వడ్డీకి మినహాయింపు (deduction) క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉన్నత విద్య సీనియర్ సెకండరీ పరీక్ష పూర్తయిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ కోసం, జీవిత భాగస్వామి కోసం లేదా మీ పిల్లల కోసం ఈ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. చట్టపరంగా పిల్లలకు సంరక్షకులుగా ఉన్న వారు కూడా ఈ మినహాయింపు పొందవచ్చు. రుణం తీసుకున్నప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు క్లెయిమ్ చేయవచ్చు. ఈ మధ్యలో ఏదైనా సంవత్సరం వడ్డీ చెల్లించినట్లయితే దాని కోసం కూడా క్లెయిమ్ చేయవచ్చు.

విద్యా రుణాలపై వడ్డీ కోసం మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పరిమితి లేదు. 80సీ కింద ఉండే మినహాయింపు కాకుండా పార్ట్ టైం ఎడ్యుకేషన్ కు కూడా క్లెయిమ్ చేయవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా విద్య కోసం రుణం తీసుకుంటే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ప్రయోజనానికి అర్హత పొందాలంటే ఏదైనా ఆర్థిక సంస్థ లేదా ఛారిటీ ఇనిస్టిట్యూషన్ నుంచి ఆమోదం పొంది ఉండాలి. అంతేకాకుండా ఆ సంస్థలను ప్రభుత్వం గుర్తించి ఉండాలి.

ఆ తేదీల్లో ఈటలపై దాడి.. ఆ తరువాత రంగంలోకి జమున.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

Huzurabad: ఆ ఇద్దరు మంత్రులకు ‘హుజూరాబాద్’ టెన్షన్.. తేడా వస్తే అలా జరుగుతుందా ?

* జీతం తీసుకునే వారికి మినహాయింపు అలవెన్స్.. (Exempt Allowance)
జీతం తీసుకుంటున్న లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారికి పన్ను చట్టాలు కొన్ని మినహాయింపులను ఇచ్చాయి. యజమాని(Employer) నుంచి పొందిన ఎడ్యుకేషనల్ అలవెన్స్ ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలకు నెలకు రూ.100 చొప్పున ఇచ్చే భత్యం.. రెండోది ఒక్కొక్కరికి హాస్టల్ అలవెన్సు కింద రూ.300 ఇచ్చే అలవెన్సు. ఇది కూడా గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది. అయితే యజమాని ఈ అలవెన్సులను జీతంలో భాగంగా ఇచ్చినప్పుడు మాత్రమే మినహాయింపు పొందే వీలుంటుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు