హోమ్ /వార్తలు /బిజినెస్ /

పెరిగిన Petrol ధరలతో బండి తీయాలంటేనే భయపడుతున్నారా?.. అయితే వీటితో మీ డబ్బు ఆదా చేసుకోండి

పెరిగిన Petrol ధరలతో బండి తీయాలంటేనే భయపడుతున్నారా?.. అయితే వీటితో మీ డబ్బు ఆదా చేసుకోండి

దీని వల్ల వార్షికంగా $2.7 బిలియన్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేసింది. దేశం యొక్క విదేశీ మారకద్రవ్యాన్ని $1.5 బిలియన్ నుండి $2.7 బిలియన్లకు ఆదా చేసేందుకు పని దినాలు, ఇంధన సంరక్షణను బ్యాలెన్స్ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ రూపొందించిన మూడు విభిన్న ప్రతిపాదనలపై అంచనాలు ఆధారపడి ఉన్నాయి.

దీని వల్ల వార్షికంగా $2.7 బిలియన్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేసింది. దేశం యొక్క విదేశీ మారకద్రవ్యాన్ని $1.5 బిలియన్ నుండి $2.7 బిలియన్లకు ఆదా చేసేందుకు పని దినాలు, ఇంధన సంరక్షణను బ్యాలెన్స్ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ రూపొందించిన మూడు విభిన్న ప్రతిపాదనలపై అంచనాలు ఆధారపడి ఉన్నాయి.

ఫ్యూయల్​ క్రెడిట్​ కార్డుల ద్వారా కొంత మొత్తంలో సేవింగ్​ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్​ కార్డులతో పెట్రోల్​, డీజిల్​ కొట్టిస్తే క్యాష్​ బ్యాక్​, రివార్డ్​ పాయింట్లను అందిస్తున్నాయి.

పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్ ధరలతో దాదాపు ప్రతి ఒక్కరి జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి సమయంలో ఇంధన పొదుపు కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. అటువంటి వారికి ఊరటనిచ్చేలా బ్యాంకులు ప్రత్యేక క్రెడిట్ కార్డులు(credit cards)  ఆఫర్​ చేస్తున్నాయి. ఈ క్రెడిట్​ కార్డులతో పెట్రోల్(petrol) డీజిల్​ కొట్టిస్తే క్యాష్​ బ్యాక్​, రివార్డ్​ పాయింట్లను అందిస్తున్నాయి. ఈ ఫ్యూయల్​ క్రెడిట్​ కార్డుల ద్వారా కొంత మొత్తంలో సేవింగ్​ చేసే అవకాశం ఉంటుంది. ఇంధన లావాదేవీలపై భారీ పొదుపులను(Savings)  అందించే ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డ్‌లను పరిశీలిద్దాం.

ఎస్​బీఐ కార్డ్ క్రెడిట్ కార్డ్

ప్రభుత్వరంగ ఎస్​బీఐ బ్యాంకు, బీపీసీఎల్​ భాగస్వామ్యంతో క్రెడిట్​ కార్డును ఆఫర్​ చేస్తోంది. ఈ క్రెడిట్​ కార్డును చేసే ఇంధన కొనుగోళ్లపై 3.25 శాతం రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇలా అత్యధికంగా రూ. 4,000 వరకు క్యాష్​బ్యాక్​ రూపంలో పొందవచ్చు. మరోవైపు, ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుతో భారత్​ ప్రెట్రోల్​ బంకుల్లో ఇంధనం కొట్టిస్తే..​ ట్రాన్సాక్షన్​పై 1 శాతం సర్​ఛార్జి మినహాయింపు లభిస్తుంది. ఈ కార్డు సహాయంతో కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, సినిమా టికెట్ల బుకింగ్​కు చేసే ప్రతి రూ. 100 ఖర్చుపై 5X రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డ్‌కు వార్షిక రుసుము రూ. 499 చెల్లించాలి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్

భారత్ పెట్రోలియం భాగస్వామ్యంతో హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డ్​ను ఆఫర్ ​చేస్తోంది. ఈ కార్డు ద్వారా చేసే ఇంధన ఖర్చులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది. కిరాణా ఖర్చులు, ఐఆర్​సీటీసీ టిక్కెట్​ బుకింగ్​పై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌ కోసం రూ. 500 వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్

ఇండియన్ ఆయిల్ భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 1 శాతం ఇంధన సర్‌చార్జి మినహాయింపు లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల వద్ద ఖర్చు చేసే ప్రతి రూ. 100కి 20 రివార్డ్ పాయింట్లు, షాపింగ్‌పై చేసే ప్రతి రూ. 100 ఖర్చుపై 5 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్‌కు వార్షికంగా రూ. 500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్​బీఐ ఆక్టేన్​ క్రెడిట్​ కార్డ్​

బీపీసీఎల్​ భాగస్వామ్యంతో ఎస్​బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్​ను ఆఫర్​ చేస్తోంది. BPCL పెట్రోల్ పంపుల వద్ద చేసే ఇంధన కొనుగోళ్లపై 7.25 శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. బీపీసీఎల్​ లావాదేవీలపై 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది. BPCL వద్ద ఖర్చు చేసే ప్రతి రూ. 100పై 25 రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ కోసం రూ. 1,499 వార్షిక రుసుము చెల్లించాలి.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

సిటీ బ్యాంక్

ఇండియన్ ఆయిల్ భాగస్వామ్యంతో సిటీ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్​ కార్డును ఆఫర్​ చేస్తోంది. ఈ క్రెడిట్​ కార్డుతో ఇండియన్​ ఆయిల్ పెట్రోల్ పంపుల వద్ద చేసే రూ. 150 ఖర్చుపై 4 టర్బో పాయింట్లు లభిస్తాయి. మరోవైపు, 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును కూడా లభిస్తుంది. ఇది కిరాణా, సూపర్ మార్కెట్లలో రూ. 150 ఖర్చు చేస్తే 2 టర్బో పాయింట్లు, ఇతర ఖర్చులపై 1 టర్బో పాయింట్లను అందిస్తుంది. 1 టర్బో పాయింట్ రూ.1 ఉచిత ఇంధనానికి సమానం.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Diesel, Petrol

ఉత్తమ కథలు