SBI Rules: ఎస్‌బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఛార్జీల వివరాలు ఇవే...

SBI Minimum Balance Rules | బ్యాంక్ బ్రాంచులు ఉన్న ప్రాంతాలను నాలుగు భాగాలుగా విభజించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవే మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఈ ప్రాంతాలను బట్టి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: March 5, 2019, 11:53 AM IST
SBI Rules: ఎస్‌బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఛార్జీల వివరాలు ఇవే...
SBI Rules: ఎస్‌బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఛార్జీల వివరాలు ఇవే...
news18-telugu
Updated: March 5, 2019, 11:53 AM IST
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? అసలు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఎంత అన్న అవగాహన మీకు లేదా? అయితే జాగ్రత్త. మీరు కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి జాగ్రత్త. మీ రోజువారీ బ్యాలెన్స్‌ను నెల మొత్తం లెక్కించి సగటు బ్యాలెన్స్‌ను నిర్ణయిస్తాయి బ్యాంకులు. దాన్నే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(MAB) అని అంటారు. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేసేవాళ్లు కనీసం రూ.1,000-రూ.3,000 మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ బ్రాంచు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. మరి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు, జరిమానాలేంటో తెలుసుకోండి.

Read this: New Rule: వాహనదారులకు శుభవార్త... ఇక ఎన్ఓసీ అవసరం లేదు

బ్యాంక్ బ్రాంచులు ఉన్న ప్రాంతాలను నాలుగు భాగాలుగా విభజించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవే మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఈ ప్రాంతాలను బట్టి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సూచించిన బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానాలు చెల్లించాలి.

మెట్రో, అర్బన్ బ్రాంచ్: మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3,000


50% లోపు తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.10+జీఎస్టీ
50-75% తక్కువ ఉంటే రూ.12 + జీఎస్టీ
75% పైన తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.15+జీఎస్టీ
Loading...
Read this: JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి

సెమీ-అర్బన్ బ్రాంచ్: మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.2,000
50% లోపు తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.7.50+జీఎస్టీ
50-75% తక్కువ ఉంటే రూ.10 + జీఎస్టీ
75% పైన తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.12+జీఎస్టీ

రూరల్ బ్రాంచ్: మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1,000
50% లోపు తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.5+జీఎస్టీ
50-75% తక్కువ ఉంటే రూ.7.50 + జీఎస్టీ
75% పైన తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.10+జీఎస్టీ

ఎస్‌బీఐలో కొన్ని అకౌంట్లకు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తించవు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా ఉంటాయి. ఆ అకౌంట్స్ ఓపెన్ చేస్తే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Realme 3 Release: ఆకట్టుకునే ఫీచర్లతో రియల్‌మీ 3 రిలీజ్... ధర రూ.8,999

IRCTC Food: ఐఆర్‌సీటీసీ ఫుడ్ ప్యాకెట్లపై ఇక బార్ కోడ్స్... ఎందుకో తెలుసా?

Bald and Beautiful: క్యాన్సర్ పేషెంట్ బ్రైడల్ ఫోటోషూట్
First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...