news18-telugu
Updated: November 23, 2020, 2:34 PM IST
SBI FD: ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ముందే విత్‌డ్రా చేస్తున్నారా? చెల్లించాల్సిన ఛార్జీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా? ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు దాచుకుంటున్నప్పుడు వడ్డీ మాత్రమే కాదు పెనాల్టీలు, ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. బ్యాంకులో డబ్బు దాచుకొని వడ్డీ పొందడానికి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు కస్టమర్లు. ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు దాచుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. వడ్డీ కూడా పొందొచ్చు. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. డబ్బులు దాచుకునేప్పుడే ఎన్ని రోజులు ఎఫ్డీ చేస్తారో చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్. అంటే మీరు ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ క్లోజ్ చేసి డబ్బు వెనక్కి తీసుకోవచ్చి. రెండో టైప్‌లో ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ ఉండదు. మీరు గడువు లోపే అకౌంట్ క్లోజ్ చేయాలంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Gold: డబ్బు తక్కువగా ఉందా? అయినా బంగారం కొనొచ్చు ఇలాSabarimala Prasadam: శబరిమల అరవణ ప్రసాదం ఇంటికి తెప్పించుకోవచ్చు... ఆర్డర్ చేయండి ఇలా
మరి ఎస్బీఐలో ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్‌కు ఛార్జీల వివరాలు చూస్తే రూ.5 లక్షల లోపు ఫిక్స్డ్ డిపాజిట్‌ను గడువు కన్నా ముందే క్లోజ్ చేస్తే 0.50 శాతం పెనాల్టీ చెల్లించాలి. రూ.5 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌కు ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ ఛార్జీలు 1 శాతం ఉంటాయి. అన్ని కాలవ్యవధులకు ఛార్జీలు ఒకేలా ఉంటాయి. ఒకవేళ 7 రోజుల్లోపే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ క్లోజ్ చేస్తే కస్టమర్లకు బ్యాంకు వడ్డీ చెల్లించదు.
IRCTC Kerala Tour: కేరళ టూర్ ప్యాకేజీ రూ.7,425 మాత్రమే... హౌజ్ బోట్లో బస చేయొచ్చు
Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే
ఇక ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చూస్తే 7 రోజుల నుంచి 45 రోజులకు 2.9 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులకు 3.9 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులకు 4.4 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు 4.4 శాతం, ఏడాది నుంచి రెండేళ్లకు 4.9 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్లకు 5.1 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లకు 5.3 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్లకు 5.4 శాతం వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లు ఐదేళ్ల కన్నా ఎక్కువ ఎఫ్డీ చేస్తే 80 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న 'స్పెషల్ ఎఫ్డీ స్కీమ్-ఎస్బీఐ వీకేర్'లో పెట్టుబడి పెడితే 6.20 శాతం వడ్డీ వస్తుంది.
Published by:
Santhosh Kumar S
First published:
November 23, 2020, 2:34 PM IST