ఇప్పుడు ఉద్యోగుల్లో ఎక్కువగా చర్చ జరిగేది పన్ను చెల్లింపుల గురించే. పన్నులు చెల్లించకుండా ఎలా సేవింగ్స్ చేయాలో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికోసం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఆ పథకాన్నే ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్, 2006 అని పిలుస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఇందులో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
ఇది కూడా చదవండి:
కస్టమర్లకు ఎస్బీఐ కొత్త వార్నింగ్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లో వడ్డీ ఎంత?
ఎస్బీఐ ఇన్కమ్
ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఏడాదికి రూ.1,000 నుంచి రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం ఐదేళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఎస్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు మిగతా ఫిక్స్ డిపాజిట్లకు ఉన్నట్టే ఉంటాయి. రూ.కోటి లోపు సామాన్యులకు 6.85 శాతం, వృద్ధులకు 7.35 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇది కూడా చదవండి:
ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవండి ఇలా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లో నిబంధనలేంటీ?
ఎస్బీఐ ఇన్కమ్
ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఐదేళ్లలోపు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోవాలి. ఇందులో నామినేషన్ సదుపాయం ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీని ప్రతీ నెల చెల్లిస్తారు. కావాలంటే వడ్డీని మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. జాయింట్ డిపాజిట్స్ తీసుకుంటే ఫస్ట్ హోల్డర్‌కు మాత్రమే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఇందులో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి:
ALERT: ఎస్బీఐ విత్‌డ్రా, డిపాజిట్ రూల్స్ మారాయి తెలుసా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
మీకు
ఎస్బీఐలో నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంటే మీరు ఫిక్స్ డిపాజిట్ అకౌంట్‌ని ఆన్లైన్లోనే తెరవచ్చు. ఇ-టీడీఆర్/ఇ-ఎస్టీడీఆర్ తెరిచే సమయంలో నామినీ పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త నామినీని యాడ్ చేయాలంటే మాత్రం బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లాలి.
ఇవి కూడా చదవండి:
ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్... కాసేపట్లో సేల్
ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?
రూ.4,000 తగ్గింపుతో రెడ్మీ నోట్ 5 ప్రోPublished by:Santhosh Kumar S
First published:January 19, 2019, 08:15 IST