SBI Recurring Deposit | ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే మొత్తం ఒకేసారి డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ వరకు డబ్బు బ్లాక్ అవుతుంది. అదే రికరింగ్ డిపాజిట్ అయితే ప్రతీ నెల పొదుపు చేయొచ్చు.
మీరు నెలనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే మీలాంటివారికోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఉంది. ఇందులో పెట్టుబడి ద్వారా మీరు పన్ను లాభాలు కూడా పొందొచ్చు. అంతేకాదు మీ పెట్టుబడిపై వడ్డీ కూడా లభిస్తుంది. రికరింగ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో సమానం. ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే మొత్తం ఒకేసారి డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ వరకు డబ్బు బ్లాక్ అవుతుంది. అదే రికరింగ్ డిపాజిట్ అయితే ప్రతీ నెల పొదుపు చేయొచ్చు. అయితే ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లో పొదుపు చేసే ముందు ఆ అకౌంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లో ప్రతీ నెల డిపాజిట్ చేయడం తప్పనిసరి. కనీసం రూ.100 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కనీసం 12 నెలలు గరిష్టంగా 120 నెలలు పొదుపు చేయాలి. రికరింగ్ డిపాజిట్లో ఉన్న మొత్తంపై 90శాతం రుణం తీసుకోవచ్చు. ఒకవేళ గడువు కంటే ముందే మొత్తం డబ్బు తీసుకోవాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు ఉన్న నియమనిబంధనలే వర్తిస్తాయి. రికరింగ్ డిపాజిట్లో నామినేషన్ సౌకర్యం కూడా ఉంది. రికరింగ్ డిపాజిట్ అకౌంట్లకు పాస్‌బుక్స్ కూడా ఇస్తారు. ఒక వేళ మీరు నెలనెలా డిపాజిట్లు చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఐదేళ్ల లోపు అకౌంట్ అయితే నెలకు రూ.100పై రూ.1.50, ఐదేళ్ల కన్నా ఎక్కువ అకౌంట్ అయితే రూ.100పై రూ.2 ఛార్జీలు చెల్లించాలి. వరుసగా మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించకపోతే మెచ్యూరిటీ తర్వాత డబ్బులు తీసుకునే సమయంలో సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
మీరు వ్యక్తిగతంగా లేదా హెచ్‌యూఎఫ్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. భారతీయులై ఉండాలి. వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలి. పన్ను మినహాయింపు లభిస్తుంది. పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ గుర్తింపు కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, ఫోటో రేషన్ కార్డు ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్, పోస్ట్ ఆఫీస్ ఇచ్చిన ఐడీ కార్డు లేదా సర్టిఫికెట్ ఇవ్వాలి.