హోమ్ /వార్తలు /బిజినెస్ /

Prepaid Plans: రూ.300 లోపు Airtel, Jio, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రూ.300 లోపు Airtel, Jio, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రూ.300 లోపు Airtel, Jio, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Plans: రూ.300 లోపు Airtel, Jio, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Recharge Plans | రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi రూ.300 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో తెలుసుకోండి.

  తక్కువ వేలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? కేవలం 28 రోజుల వేలిడిటీతో రూ.300 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా-Vi. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి డేటాతో పాటు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు ఆయా టెలికామ్ సంస్థలు కొన్ని యాప్స్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నాయి. మరి రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా-Vi అందిస్తున్న ఆ ప్లాన్స్ ఏవో, వాటిని రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.

  Airtel Rs 48 plan: ఎయిర్‌టెల్‌లో రూ.48 ధరకు మొబైల్ డేటా ప్లాన్ ఉంది. రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీతో 3జీబీ డేటా వస్తుంది. అదనంగా డేటా కావాలనుకునేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది.

  Airtel Rs 149 plan: ఎయిర్‌టెల్‌లో రూ.149 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ ఉచితం. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Airtel Rs 179 plan: ఎయిర్‌టెల్‌లో రూ.179 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ ఉచితం. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది.

  Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, డేటాతో Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

  Gold: ధంతేరాస్‌కు ముందు బంపరాఫర్... మార్కెట్ రేటుకన్నా తక్కువకే బంగారం

  Airtel Rs 219 plan: ఎయిర్‌టెల్‌లో రూ.219 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Airtel Rs 249 plan: ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

  Airtel Rs 279 plan: ఎయిర్‌టెల్‌లో రూ.279 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది.

  Airtel Rs 289 plan: ఎయిర్‌టెల్‌లో రూ.289 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది.

  Airtel Rs 298 plan: ఎయిర్‌టెల్‌లో రూ.298 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది.

  IRCTC Kerala Tour: హౌజ్ బోట్‌లో స్టేతో కేరళ టూర్... ప్యాకేజీ ధర తెలిస్తే షాకే

  UPI Money Transfer: గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు త్వరలో ఊహించని షాక్

  Jio Rs 75 plan: జియో రూ.75 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ఆన్ నెట్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్ నెట్ కాలింగ్ 500 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు.

  Jio Rs 125 plan: జియో రూ.125 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఆన్ నెట్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్ నెట్ కాలింగ్ 500 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. 300ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  Jio Rs 155 plan: జియో రూ.155 రీఛార్జ్ చేస్తే 28జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఆన్ నెట్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్ నెట్ కాలింగ్ 500 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. 300ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  Jio Rs 185 plan: జియో రూ.185 రీఛార్జ్ చేస్తే 56జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఆన్ నెట్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్ నెట్ కాలింగ్ 500 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. 300ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  Jio Rs 199 plan: జియో రూ.199 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ చొప్పున 28 రోజులకు 42జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. నాన్ జియో నెంబర్స్‌కు కాల్ చేయడానికి 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 249 plan: జియో రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ చొప్పున 28 రోజులకు 56జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. నాన్ జియో నెంబర్స్‌కు కాల్ చేయడానికి 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తుంది.

  Jio New Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

  మీ EPF Account Transfer ఆన్‌లైన్‌లో ఈజీగా చేయండిలా

  Vi Rs 48 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.48 రీఛార్జ్ చేస్తే 28 రోజులకు 3 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా డేటా కావాలంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

  Vi Rs 49 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.49 రీఛార్జ్ చేస్తే రూ.38 టాక్‌టైమ్ లభిస్తుంది. లోకల్ లేదా నేషనల్ కాల్ చేస్తే సెకండ్‌కు 2.5 పైసలు ఛార్జ్ పడుతుంది. 400ఎంబీ డేటా లభిస్తుంది.

  Vi Rs 98 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.98 రీఛార్జ్ చేస్తే 28 రోజులకు 12 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా డేటా కావాలంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

  Vi Rs 219 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.219 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్ ఉచితం. ఎంపీఎల్‌లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్‌కి రూ.75 డిస్కౌంట్ రోజూ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.

  Vi Rs 249 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్ ఉచితం. ఎంపీఎల్‌లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్‌కి రూ.75 డిస్కౌంట్ రోజూ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.

  Vi Rs 299 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.299 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 4జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్ ఉచితం. ఎంపీఎల్‌లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్‌కి రూ.75 డిస్కౌంట్ రోజూ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, VODAFONE, Vodafone Idea

  ఉత్తమ కథలు