హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Saving Tips: పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు

Tax Saving Tips: పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు

Tax Saving Tips: పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు
(ప్రతీకాత్మక చిత్రం)

Tax Saving Tips: పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు (ప్రతీకాత్మక చిత్రం)

Tax Saving Tips | పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయన్న విషయం తెలిసిన పన్నుచెల్లింపుదారులు తక్కువే. ఎక్కువ సెక్షన్స్ ఉపయోగించుకుంటే ఎక్కువ పన్ను ఆదా చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పాత పన్ను విధానం (Old Tax Regime) ఎంచుకునేవారు పలు రకాల మినహాయింపులు, తగ్గింపులతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. లేదా అస్సలు పన్ను చెల్లించకుండా బయటపడొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని (Income Tax Act) పలు సెక్షన్ల ప్రకారం 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. కానీ పన్ను చెల్లింపుదారులకు వీటి గురించి తెలిసింది తక్కువే. ఎక్కువగా 80సీ, 80డీ మినహాయింపుల గురించే చర్చిస్తుంటారు. కానీ ఇంకా చాలా మినహాయింపులు, తగ్గింపులతో పన్ను భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఏ సెక్షన్ ప్రకారం మీరు ఎంత పన్ను ఆదా చేయొచ్చో, ఎంత లిమిట్ ఉంటుందో తెలుసుకోండి.

Section 80C: ఇది పాపులర్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు లిమిట్ ఉంటుంది. ఈ సెక్షన్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ , లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్, పిల్లల ట్యూషన్ ఫీజ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, హోమ్ లోన్ ప్రిన్సిపల్ పేమెంట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ లాంటివి ఈ సెక్షన్‌లోకి వస్తాయి.

New Tax Regime: కొత్త పన్ను విధానం ఎంచుకున్న తర్వాత పాత విధానంలోకి వెళ్లొచ్చా?

Section 80CCC: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన యాన్యుటీ ప్లాన్ లేదా ఫండ్ నుంచి పెన్షన్ పొందడం కోసం ఏదైనా ఇతర జీవిత బీమా కంపెనీలో దాచుకునే డబ్బులకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సెక్షన్ కింద రూ.1,50,000 వరకు తగ్గింపు పొందొచ్చు.

Section 80CCD: ప్రభుత్వం నోటిఫై చేసిన నేషనల్ పెన్షన్ స్కీమ్స్ లాంటి పెన్షన్ పథకాల్లో దాచుకునే మొత్తానికి మినహాయింపు లభిస్తుంది.

Section 80D: సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్లకు రూ.30,000 వరకు ప్రీమియం చెల్లించి డిడక్షన్ పొందొచ్చు. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ అందుబాటులో లేని 80 ఏళ్లు దాటిన వృద్ధులకు వైద్య ఖర్చులకు రూ.30,000 వరకు లిమిట్ ఉంటుంది.

Section 80DD: తమపై ఆధారపడుతున్న దివ్యాంగులకు చికిత్స కోసం ఖర్చు చేస్తే రూ.75,000 తగ్గింపు పొందొచ్చు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటే రూ.1,25,000 వరకు డిడక్షన్ పొందొచ్చు.

Income Tax: ఏ ట్యాక్స్ శ్లాబ్‌తో ఎక్కువ పన్ను ఆదా అవుతుందో తెలుసుకోండి

Section 80DDB: సెక్షన్ 80డీడీబీ కింద 60 ఏళ్ల లోపు వ్యక్తులు తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకుంటే రూ.40,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. తమపై ఆధారపడ్డవారికి చికిత్స చేయించినా క్లెయిమ్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.60,000 వరకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.80,000 వరకు లిమిట్ ఉంటుంది.

Section 80E: ఉన్నత విద్య కోసం లోన్ తీసుకుంటే చెల్లించిన వడ్డీపై సెక్షన్ 80ఈ కింద తగ్గింపు పొందొచ్చు. అయితే ఎడ్యుకేషన్ లోన్‌లో అసలు చెల్లిస్తే ట్యాక్స్ డిడక్షన్స్ పొందలేరు.

Section 80EE: తొలిసారి ఇల్లు కొన్నవారు రూ.50,000 వరకు హోమ్ లోన్ వడ్డీపై సెక్షన్ 80ఈఈ కింద అదనంగా ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు.

Section 80G: సెక్షన్ 80జీ కింద కొన్ని సహాయ నిధులు, స్వచ్ఛంద సంస్థలకు చేసిన విరాళాలను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు.

Section 80GG: నివాస గృహం లేనివారు, హౌజ్ రెంట్ అలవెన్స్ పొందని వేతనజీవులు సెక్షన్ 80జీజీ కింద రూ.60,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు.

Budget 2023: కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు మధ్య తేడా ఏంటీ? దేనివల్ల ఎక్కువ లాభం?

Section 80TTA: సెక్షన్ 80టీటీఏ కింద ఒక వ్యక్తి లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్టంగా రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. బ్యాంకులు, కో-ఆపరేటివ్ సొసైటీ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సంబంధించి ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేయవచ్చు.

First published:

Tags: Income tax, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు