పాన్ కార్డ్... ఆర్థిక లావాదేవీలకు అవసరమైన డాక్యుమెంట్. 18 రకాల లావాదేవీలకు తప్పనిసరిగా పాన్ కార్డును సబ్మిట్ చేయాలి. ఆ లావాదేవీలేవో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరి మీరు ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ లేదా ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ఎవరి పాన్ కార్డునైనా ప్రూఫ్‌గా తీసుకుంటున్నారా? మరి ఆ పాన్ కార్డ్ ఒరిజనలా కాదా మీకు ఎలా తెలుస్తుంది? పాన్ కార్డులో ఉండే ఫీచర్స్‌ని సరిగ్గా గమనిస్తే అది నకిలీ పాన్ కార్డో లేక ఒరిజినల్ కార్డో తెలిసిపోతుంది. అయితే 2018 జూలై 7 కన్నా ముందు జారీ చేసిన పాన్ కార్డులన్నీ పాత డిజైన్ ప్రకారమే ఉంటాయి. 2018 జూలై 7 తర్వాత జారీ చేసిన పాన్ కార్డ్, ఇ-పాన్ కార్డుల్లో కింద వివరించిన ఈ ఫీచర్స్ ఉంటాయి.
కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాన్ కార్డ్ హోల్డర్ వివరాలు తెలుస్తాయి. ఈ కోడ్ స్కాన్ చేయాలంటే ఎన్ఎస్డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూపొందించిన PAN QR Code Reader యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ పాన్ కార్డుపై పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పేరు, పాన్ కార్డ్ హోల్డర్ తల్లి లేదా తండ్రి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఉంటాయి. వీటితో పాటు పాన్ కార్డుపై పాన్ కార్డ్ హోల్డర్ ఫోటో, సంతకం ఉంటాయి.
Pension Alert: పెన్షన్ కావాలంటే నవంబర్ 30 లోగా ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే
పాన్ కార్డుపై ఉండే వివరాలను డీకోడ్ చేసి అది ఒరిజినల్ కార్డో లేదో తెలుసుకోవచ్చు. కార్డుపై వ్యక్తి పేరు లేదా సంస్థ పేరు ఉంటుంది. వ్యక్తులు పాన్ కార్డు తీసుకుంటే తండ్రి పేరు లేదా తల్లి పేరు ఉంటుంది. వ్యక్తులు తీసుకునే పాన్ కార్డుపై పుట్టిన తేదీ కూడా ఉంటుంది. సంస్థలు అయితే ఆ సంస్థ ప్రారంభించిన తేదీ ఉంటుంది. పాన్ నెంబర్లో మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలతో ఈ నెంబర్ ఉంటుంది.
పాన్ నెంబర్లో మొదటి మూడు అక్షరాలు A నుంచి Z మధ్య అక్షరాలతో నాలుగో లెటర్ పాన్ కార్డ్ హోల్డర్ స్టేటస్‌ను తెలియజేస్తుంది. వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకున్నట్టైతే P అని ఉంటుంది. అంటే వ్యక్తులు తీసుకునే పాన్ కార్డులో నాలుగో అక్షరం తప్పనిసరిగా P అనే ఉంటుంది. ఇతర అక్షరాలు కూడా ఉంటాయి. నాలుగో అక్షరం P కాకుండా ఇతర అక్షరాలు ఉన్నట్టైతే అది వ్యక్తిగత పాన్ కార్డ్ కాదు.
అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్-A, బాడీ ఆఫ్ ఇండివిజ్యువల్స్-B, కంపెనీ-C, ఫర్మ్స్-F, గవర్నమెంట్-G, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ-H, లోకల్ అథారిటీ-L, ఆర్టిఫిషియల్ జ్యుడీషియల్ పర్సన్-J, ఇండివిజ్యువల్-P, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఏ ట్రస్-T అని పాన్ కార్డులో నాలుగో అక్షరం వేర్వేరుగా ఉంటాయి. P అని అంటే వ్యక్తులది, C అని ఉంటే కంపెనీది అని అర్థం చేసుకోవాలి. ఇక ఐదో అక్షరం సదరు వ్యక్తి పేరులో మొదటి లెటర్ ఉంటుంది. ఆ తర్వాత 4 నెంబర్లు, ఒక అక్షరం ఆదాయపు పన్ను శాఖ జనరేట్ చేసినవి ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PAN, PAN card, Personal Finance