New Rules: జూలై 1 నుంచి మారే నిబంధనలివే...

New Rules From July 1 | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్‌టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ ఛార్జీలను ఎత్తేసింది. జూలై 1 నుంచి ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: June 30, 2019, 4:58 PM IST
New Rules: జూలై 1 నుంచి మారే నిబంధనలివే...
New Rules: జూలై 1 నుంచి మారే కొత్త నిబంధనలివే... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 30, 2019, 4:58 PM IST
జూలై  వచ్చేసింది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. అవి మీ రోజువారీ జీవితంపై, ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపించేవే. మీరు తరచూ బ్యాంకులో లావాదేవీలు జరుపుతుంటారా? అయితే జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ తెలుసుకోవాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్, వడ్డీ రేట్లు... ఇలా పలు అంశాల్లో మారిన నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. మరి ఆ రూల్స్ ఏవో తెలుసుకోండి.

1. RTGS & NEFT: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్‌టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ ఛార్జీలను ఎత్తేసింది. జూలై 1 నుంచి ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్‌టీజీఎస్ ద్వారా భారీ మొత్తంలో, నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

2. LPG Cylinders: జూన్ 1న ఎల్‌పీజీ ధరలు కాస్త పెరిగాయి. జూలై 1 నుంచి కొత్త ఎల్‌పీజీ ధరలు అమలులోకి వస్తాయి.

3. BSBD Account: బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ ఉన్నవారికి ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఉచితంగా మరో 5 సేవల్ని అందించాలని ఆర్‌బీఐ బ్యాంకుల్ని ఆదేశించింది. ఏటీఎంలతో పాటు బ్రాంచ్‌తో కనీసం నాలుగు విత్‌డ్రాయల్స్, ఏ బ్రాంచ్‌లో అయినా డబ్బులు డిపాజిట్ చేసే సౌకర్యం లాంటి కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.



4. Savings Scheme: మీరు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. జూలై 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది.

5. SBI Home Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ఆఫర్ చేయనుంది ఎస్‌బీఐ. అంటే రెపో రేట్ ఆధారంగా హోమ్ లోన్ వడ్డీ రేట్ నిర్ణయిస్తుంది ఎస్‌బీఐ. దీని ద్వారా హోమ్ లోన్ తీసుకునేవారికి మేలు జరగనుంది.

6. Mahindra Cars: మహీంద్రా కార్లు కొనాలంటే జూలై 1 నుంచి కాస్త ఎక్కువగా ఖర్చు చేయాల్సిందే. వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు ఇటీవలే ప్రకటించింది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ. ఒక్కో వాహనంపై రూ.36,000 పెరగనుంది.
Loading...
BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఈ 5 ఫీచర్లు తెలుసుకోండి

Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...