హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance JioFiber: ఆకర్షణీయంగా జియో ఫైబర్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్.. వివరాలివే

Reliance JioFiber: ఆకర్షణీయంగా జియో ఫైబర్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్.. వివరాలివే

Jio Fiber Plans: జియో ఫైబర్ ప్లాన్స్​ రూ.399తో 30 ఎంబీపీఎస్​తో మొదలై.. 1జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్స్​ వరకు ఉన్నాయి. అలాగే వివిధ ప్లాన్స్​లో నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​, డిస్నీప్లస్ హాట్​స్టార్ లాంటి ఓటీటీ సేవలు ఉచితంగా వస్తున్నాయి.

Jio Fiber Plans: జియో ఫైబర్ ప్లాన్స్​ రూ.399తో 30 ఎంబీపీఎస్​తో మొదలై.. 1జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్స్​ వరకు ఉన్నాయి. అలాగే వివిధ ప్లాన్స్​లో నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​, డిస్నీప్లస్ హాట్​స్టార్ లాంటి ఓటీటీ సేవలు ఉచితంగా వస్తున్నాయి.

Jio Fiber Plans: జియో ఫైబర్ ప్లాన్స్​ రూ.399తో 30 ఎంబీపీఎస్​తో మొదలై.. 1జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్స్​ వరకు ఉన్నాయి. అలాగే వివిధ ప్లాన్స్​లో నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​, డిస్నీప్లస్ హాట్​స్టార్ లాంటి ఓటీటీ సేవలు ఉచితంగా వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  బ్రాండ్​బాండ్​ రంగంలో రిలయన్స్​ జియో ఫైబర్ దూసుకెళుతోంది. ఆకర్షణీయమైన ప్లాన్​లతో వినియోగదారుల సంఖ్యను రోజురోజుకూ పెంచుకుంటోంది. ఇదే క్రమంలో పోస్ట్ పెయిన్ ప్లాన్ల ఆప్షన్​ను కూడా జియో ఫైబర్ తీసుకొచ్చింది. అలాగే పోస్ట్ పెయిడ్​కు ఇన్​స్టాలేషన్ చార్జీలు, ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. అయితే పోస్ట్ పెయిడ్​లో ఆరు నెలలు లేదా సంవత్సరం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. పోటీ బ్రాండ్​బాండ్ సంస్థల కంటే దాదాపు తక్కువ ధరలతో జియో ఫైబర్ ప్లాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

  జియో ఫైబర్ ప్లాన్స్​ రూ.399తో 30 ఎంబీపీఎస్​తో మొదలై.. 1జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్స్​ వరకు ఉన్నాయి. అలాగే వివిధ ప్లాన్స్​లో నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​, డిస్నీప్లస్ హాట్​స్టార్ లాంటి ఓటీటీ సేవలు ఉచితంగా వస్తున్నాయి. ఒకవేళ ఎంచుకున్న ప్లాన్​లో మీకు కావాల్సిన ఓటీటీ ప్లాట్​ఫామ్ లేకపోతే డిస్కౌంట్​తో సబ్​స్క్రైబ్ చేసుకునే సదుపాయాన్ని జియో ఫైబర్ ఇస్తోంది. ఇలా ఆకర్షణీయంగా ఉన్న జియో ఫైబర్ ప్రీపెయిడ్, పోస్ట్ ప్లాన్స్​ వివరాలను చూడండి.

  జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్స్​: జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రస్తుతం నెలకు రూ.399 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 30 ఎంబీపీఎస్​ స్పీడ్​తో 30 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ వస్తుంది. రూ.499తో ప్రారంభమయ్యే ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్​ ఎంట్రీ ప్యాక్ కంటే ఇది చౌక. రూ.399 ప్లాన్​తో జియో ఫైబర్​ నెలంతా 30 ఎంబీపీఎస్​ వేగంతో అన్​లిమిటెడ్​ డేటాను ఇస్తుండగా.. అదే రూ.699 ప్లాన్​తో 100 ఎంబీపీఎస్​ వేగాన్ని అందిస్తోంది. రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్​ వేగంతో అన్​లిమిటెడ్ డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్​, డిస్నీ ప్లస్​హాట్ స్టార్​ వీఐపీ, సోనీ లివ్​, జీ5, లయన్స్ గేట్ ప్లే లాంటి 12 సబ్​స్క్రిప్షన్లు ఫ్రీగా వాడుకోవచ్చు. అలాగే 300 ఎంబీసీఎస్ ఉండే రూ.1499, 500 ఎంబీపీఎస్తో వచ్చే రూ.2499, 1 జీబీపీఎస్ ప్లాన్ రూ.3999 తీసుకుంటే ఆ 12 ఓటీటీలతో పాటు నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు.

  జియో ఫైబర్​ బ్రాడ్​బాండ్​ పోస్ట్​పెయిడ్​.. ఆరు నెలల బిల్లింగ్​తో: ఆరు నెలల ప్రీపెయిడ్ ప్లాన్​లో రూ.2349 చెల్లిస్తే 30 ఎంబీపీఎస్ స్పీడ్​తో బ్రాండ్​బాండ్ పొందవచ్చు. అలాగే 100 ఎంబీపీఎస్ కావాలంటే ఆరు నెలలకు రూ.4194 బిల్ వస్తుంది. ఇక 150 ఎంబీపీఎస్ స్పీడ్​తో పాటు అమెజాన్ ప్రైమ్​ వీడియో, డిస్నీప్లస్ హాట్​స్టార్​, సోనీలివ్​, జీ5, సన్​ నెక్ట్స్, వూట్ సెలెక్షన్​, వూట్ కిడ్స్​, ఆల్ట్​ బాలాజీ, షెమారోమీ, లయన్స్​గేట్​ ప్లే, డిస్కవరీ ప్లస్​, ఇరోస్​ నౌ, జియో సినిమా, జియో సావన్​ సేవలు కూడా పొందాలంటే ఆరు నెలలకు రూ.5994 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇంతకంటే ఎక్కువ స్పీడ్ ప్లాన్స్​తో నెట్​ఫ్లిక్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఆరు నెలలకు 300 ఎంబీపీఎస్ ప్లాన్​​ కోసం రూ.8994, 500 ఎంబీపీఎస్​ ప్లాన్ కోసం రూ.14,994, 1జీబీపీఎస్ ప్లాన్​ కోసం రూ.23,994లు చెల్లించాల్సి ఉంటుంది.

  జియోఫైబర్ బ్రాడ్​బాండ్​ పోస్ట్​ పెయిడ్.. 12 నెలల బిల్లింగ్​తో..

  12 నెలల పోస్ట్​పెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే.. 30 ఎంబీపీఎస్ కోసం రూ.4788, 100 ఎంబీపీఎస్ కోసం రూ.8,388, 150 ఎంబీపీఎస్ కోసం రూ.11,988, 300 ఎంబీపీఎస్ కోసం రూ.17,988, 500 ఎంబీపీఎస్ కోసం రూ.29,988, 1జీబీపీఎస్ కోసం రూ.47,988 చెల్లించాల్సి ఉంటుంది. జియో ఫైబర్ పోస్ట్​పెయిడ్ ప్లాన్ల డేటా స్పీడ్​, అన్​లిమిటెడ్ డేటా, సబ్​స్క్రిప్షన్లు అన్నీ ప్రీపెయిడ్ ప్లాన్లను పోలి ఉంటాయి. ప్రీపెయిడ్ ప్లాన్ల వాలిడిటీ 30 రోజుల పాటు ఉంటుంది.

  First published:

  Tags: JioFiber, Reliance Jio

  ఉత్తమ కథలు