నోకియా పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు (Smartphones), ఇతర గ్యాడ్జెట్స్ గుర్తొస్తాయి కదా? మరి కోల్గేట్ (Colgate) పేరు వింటే ఏం గుర్తొస్తుంది? టూత్ పేస్ట్ గుర్తొస్తుంది. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనే యాడ్ గుర్తొస్తుంది. అసలు ఈ కంపెనీలు మొదట తయారు చేశాయో, ఏమి అమ్మాయో తెలుసా? నోకియా మొదట టాయిలెట్ పేపర్లు తయారు చేసి అమ్మింది. కోల్‌గేట్ క్యాండిల్స్ తయారు చేసింది. ఇలా ప్రస్తుత ప్రముఖ కంపెనీలు మొదట్లో ఏఏ ప్రొడక్ట్స్ తయారు చేశాయో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. వాల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్వీట్‌ని ఆయన రీట్వీట్ చేశారు.
ఆంట్రప్రెన్యూర్స్ ఎలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారో, అవకాశాలను ఎలా గుర్తిస్తారో చెప్పే లిస్ట్ ఇది అని, మన వ్యక్తిగత జీవితాలకు అనేక పాఠాలను నేర్పుతుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మార్పును చూసి భయపడవద్దని, మీరు మొదట ప్రారంభించిన దానితోనే ఉండాల్సిన అవసరం లేదని, పరిణామమే జీవితం అని అభిప్రాయ పడ్డారు. వాల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్వీట్‌లో ఆసక్తికరమైన వివరాలున్నాయి. ప్రముఖ కంపెనీలు మొదట్లో తయారు చేసిన వస్తువుల జాబితా ఉంది. ఆ జాబితా ప్రకారం ఏ కంపెనీ మొదట ఏఏ ప్రొడక్ట్స్ తయారు చేసిందో తెలుసుకుందాం.
Driving License: గుడ్ న్యూస్... డ్రైవింగ్ లైసెన్స్ సహా 58 సేవలు ఆన్‌లైన్‌లోనే
A fascinating list that shows how entrepreneurs are flexible & ‘pivot’ when opportunity arises. But it provides a great lesson even for our personal lives: Don’t be afraid of change. You don’t have to stay wedded to what you originally started out to do. Evolution is life! https://t.co/nlWSuFoGsu
— anand mahindra (@anandmahindra) September 16, 2022
ఎలక్ట్రానిక్స్ కంపెనీగా పేరున్న నోకియా టాయిలెట్ పేపర్లు అమ్మింది. మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ మొదట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు తయారు చేసింది. ఇక స్మార్ట్‌ఫోన్ , స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన సాంసంగ్ పండ్లు, చేపల్ని అమ్మింది. ప్రముఖ టాయ్స్ కంపెనీ లీగో వుడెన్ టాయ్ డక్స్ తయారుచేసేది. ఓరల్ కేర్ బ్రాండ్ అయిన కోల్గేట్ మొదట్లో క్యాండిల్స్ తయారు చేసేది. టొయోటా మొదట్లో మగ్గం పనులు చేసేది. నింటెండో కంపెనీ ప్లేయింగ్ కార్డ్స్, టిఫానీ అండ్ కో కంపెనీ స్టేషనరీ, హస్‌బ్రో కంపెనీ టెక్స్‌టైల్స్, ఐకియా సంస్థ పెన్స్, వ్రిగ్లీ సంస్థ సోప్, ఎవాన్ కంపెనీ బుక్స్, డ్యూపాంట్ మొదట్లో గన్ పౌడర్ అమ్మేవి.
SBI Discount: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఎస్‌బీఐ కార్డుతో రూ.10,750 వరకు డిస్కౌంట్
ఇలా ఈ కంపెనీలన్నీ మొదట తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవే. కానీ ఇప్పుడు ఈ కంపెనీల పేరు చెబితే గుర్తొచ్చే ప్రొడక్ట్స్ వేరు. ఎక్కడ మార్కెట్ ఉందో, మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందో తెలుసుకొని, వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఈ కంపెనీలు ఇంతలా ఎదిగాయి. మొదట తయారు చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలని పట్టుబట్టి కూర్చొని ఉంటే ఇంత పెద్ద కంపెనీలు కాకపోయేవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, Nokia, Samsung, Viral post, Viral tweet