హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Refund Rules: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

IRCTC Refund Rules: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

IRCTC: ఇక ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు

IRCTC: ఇక ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు

IRCTC Refund Rules | చాలామందికి టికెట్ క్యాన్సిలేషన్ నియమనిబంధనలు తెలియక డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ వీడియో విడుదల చేశారు.

  మీరెప్పుడైనా చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకొని రైల్వే టికెట్ క్యాన్సిల్ చేశారా? టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారా? మీకే కాదు... చాలామందికి ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేయడం ఓ పెద్ద సవాల్ అయితే... టికెట్ క్యాన్సిల్ చేసినతర్వాత రీఫండ్ పొందడం అంతకంటే పెద్ద సవాల్. చాలామందికి టికెట్ క్యాన్సిలేషన్ నియమనిబంధనలు తెలియక డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ వీడియో విడుదల చేశారు. టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ వివరించారు. ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు నష్టపోకుండా చైతన్యపరుస్తోంది రైల్వే శాఖ. టికెట్ క్యాన్సలేషన్ విషయంలో రైల్వే శాఖ నియమనిబంధనలు ఇవే.


  Read this: Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?


  irctc refund rules 2018, irctc refund rules 2019, irctc refund rules, how to get refund on cancelled ticket, irctc helpline no for refund, irctc failed transaction refund rules, irctc ticket refund status, irctc customer care number for refund, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్, ఐఆర్‌సీటీసీ రీఫండ్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సిలేషన్


  రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే...

  ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్లపై రూ.240 కోత

  2 ఏసీ/ఫస్ట్ క్లాస్ టికెట్లపై రూ.200 కోత

  3 ఏసీ/ఏసీ చైర్ కార్/3ఏసీ ఎకనమీ క్లాస్ టికెట్లపై రూ.180 కోత

  సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్లపై రూ.120 కోత

  సెకండ్ క్లాస్ టికెట్లపై రూ.60 కోత


  రైలు బయల్దేరడానికి 48 నుంచి 12 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే...

  రిజర్వ్‌డ్ టికెట్లపై బుకింగ్ అమౌంట్‌పై 25 శాతం కోత


  రైలు బయల్దేరడానికి 12 నుంచి 6 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే...

  రిజర్వ్‌డ్ టికెట్లపై బుకింగ్ అమౌంట్‌పై 50 శాతం కోత


  Read this: SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్‌బీఐ రూల్స్ ఇవే

  irctc refund rules 2018, irctc refund rules 2019, irctc refund rules, how to get refund on cancelled ticket, irctc helpline no for refund, irctc failed transaction refund rules, irctc ticket refund status, irctc customer care number for refund, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్, ఐఆర్‌సీటీసీ రీఫండ్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సిలేషన్


  తత్కాల్ టికెట్ల క్యాన్సిలేషన్


  తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. ఒకవేళ రైలు 3 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రిసిప్ట్(TDR) ఫైల్ చేసి రీఫండ్ పొందొచ్చు.

  టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?


  మొదట IRCTC వెబ్‌సైట్‌లో లాగిన్ చేయాలి.

  ‘my account’లో ‘my transaction’ పేజీలోకి వెళ్లాలి.

  ‘file TDR’ ఆప్షన్ ఎంచుకోవాలి.

  టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో కారణం చెప్పాలి.

  ‘file TDR’ బటన్‌పై క్లిక్ చేయాలి.


  ఒకవేళ కౌంటర్‌లో టికెట్ బుక్ చేసినట్టైతే పీఎన్ఆర్ నెంబర్, ప్రయాణికుల వివరాలతో టీడీఆర్ ఫామ్ పూర్తి చేసి రీఫండ్ పొందొచ్చు.


  Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్


  ఇవి కూడా చదవండి:


  Paytm First: అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'పేటీఎం ఫస్ట్'... ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకోండి


  LIC Alert: మోసపోతారు జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎల్ఐసీ


  2019 Smartphones: రూ.15,000 లోపు టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

  First published:

  Tags: Indian Railways, Irctc, Railways

  ఉత్తమ కథలు