Senior Citizen Tax: సీనియర్ సిటిజన్లకు వర్తించే ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఇవే

సీనియర్ సిటిజన్లకు వర్తించే ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Tax Benefits for Senior Citizens | ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అనేక ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి.

  • Share this:
ఆదాయపు పన్ను (ఐ-టి) చెల్లించే సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. 60 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తిని 'సీనియర్ సిటిజన్'గా, 80 ఏళ్లు పైబడిన వ్యక్తిని 'సూపర్ సీనియర్ సిటిజన్'గా పిలుస్తారు. సాధారణ పన్ను చెల్లింపుదారులతొ పోలిస్తే వీరికి అనేక పన్ను మినహాయింపులు లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు


సాధారణ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అధిక మినహాయింపు పరిమితి ఇవ్వబడుతుంది. అనగా ఒక పరిమితి వరకు వచ్చే ఆదాయానికి వీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరికి పన్ను మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా, వార్షిక ఆదాయం రూ .2.5 లక్షల వరకు ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. అదే, సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే ఈ పరిమితి రూ .3 లక్షల వరకు, సూపర్ సీనియర్ సిటిజన్ల విషయంలో రూ .5 లక్షల వరకు ఉంటుంది. అంతేకాక, రెసిడెంట్ సీనియర్ సిటిజన్‌లకు అదనంగా మరో రూ.50 వేల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.

Aadhaar SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

Aadhaar Card: ఆధార్‌లో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు ఓ కాల్ చేయండి చాలు

ఆరోగ్య బీమా ప్రీమియంలపై రాయితీ


సీనియర్ సిటిజన్లు ఆరోగ్య భీమా పాలసీ చందాదారులు ప్రీమియం కింద ఏడాదికి చెల్లించే రూ .50 వేల మొత్తంపై పన్ను రాయితీ లభిస్తుంది.

ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు


ఆదాయపు పన్ను (ఐ-టి) చట్టంలోని సెక్షన్ 208 కింద, ఏడాదికి రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ప్రతి వ్యక్తి "ముందస్తు పన్ను" రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సెక్షన్ 207 కింద సీనియర్ సిటిజన్లకు ముందస్తు పన్ను చెల్లించడం నుండి ఉపశమనం లభిస్తుంది. సెక్షన్ 207 ప్రకారం, సీనియర్ సిటిజన్కు వ్యాపారం లేదా వృత్తి నుండి ఎటువంటి ఆదాయం ఉండనందున ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను శాఖ తమ వెబ్‌సైట్ పేర్కొంది.

Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Post Office Savings Account: బ్యాంకు కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌తో లాభం ఎక్కువ... ఎందుకంటే

వడ్డీపై వచ్చే ఆదాయంపై ప్రయోజనాలు


ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లేదా పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకులలో పెట్టే ఫిక్స్డ్ డిపాజిట్ల నుండి రూ.50 వేల వరకు వచ్చే వడ్డీపై పన్ను రాయితీ లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టిటిబి కింద సీనియర్ సిటిజన్లకు ఈ సడలింపు వర్తిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: