Fixed Deposit SBI - ICICI Bank - HDFC: ఏ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే లాభం?

Fixed Deposit Interest Rates Comparison | మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 11, 2020, 7:16 PM IST
Fixed Deposit SBI - ICICI Bank - HDFC: ఏ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే లాభం?
Fixed Deposit: ఏ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే లాభం? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:

ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఎఫ్డిలు మంచి రిటర్న్స్ను అందిస్తాయి. ఇవి మీ రాబడికి హామీ అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్స్లో పెట్టిన పెట్టుబడిగి గ్యారెంటీ రాబడి ఉంటుంది. వీటిలో పెట్టే పెట్టుబడులకు వచ్చే వడ్డీ బ్యాంకును, పెట్టుబడి కాలాన్ని బట్టి మారుతుంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు ప్రారంభ స్థాయిలో ఏడు రోజుల కాలం నుండి రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు అందించే బ్యాంకులు వడ్డీ రేట్లను ఎప్పటికప్పడు మారుస్తుంటాయి. ఇవి స్థిరంగా ఉండవు. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను సవరించింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్డి) రూ .2 కోట్ల వరకు చెల్లించే వడ్డీ రేట్లను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. ఈ వడ్డీ రేటు సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్స్కు ఒకేలా ఉండదు.



SBI ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్



7 రోజుల నుండి 45 రోజుల వరకు- 2.9%
46 రోజుల నుండి 179 రోజుల వరకు- 3.9%
180 రోజుల నుండి 210 రోజుల వరకు- 4.4%
211 రోజుల నుండి ఏడాది కన్నా తక్కువ- 4.4%
ఏడాది నుండి రేండేళ్ల కన్నా తక్కువ- 4.9%రేండేళ్ల నుండి మూడేళ్ల కన్నా తక్కువ- 5.1%
మూడేళ్ల నుండి ఐదేళ్ల కన్నా తక్కువ- 5.3%
ఐదేళ్ల నుండి పదేళ్ల వరకు- 5.4%

HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్


7 నుంచి 14 రోజులు- 2.50%
15 నుంచి 29 రోజులు- 2.50%
30 నుంచి 45 రోజులు- 3.00%
46 నుంచి 60 రోజులు- 3.00%
61 నుంచి 90 రోజులు- 3.00%
91 రోజుల నుంచి 6 నెలలు- 3.50%
6 నెలల1 రోజు నుంచి 9 నెలలు- 4.40%
9 నెలల1 రోజు నుంచి ఏడాది- 4.40%
ఒక సంవత్సరం- 5.10%
ఏడాది 1 రోజు నుంచి రెండేళ్లు- 5.10%
రెండేళ్ల 1 రోజు నుంచి మూడేళ్లు- 5.15%
మూడేళ్ల 1 రోజు నుంచి ఐదేళ్లు- 5.30%
ఐదేళ్ల 1 రోజు నుంచి పదేళ్లు- 5.50%

ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు


7 రోజుల నుంచి 14 రోజులు- 2.50%
15 రోజుల నుంచి 29 రోజులు- 2.50%
30 రోజుల నుంచి 45 రోజులు- 3.00%
46 రోజుల నుంచి 60 రోజులు- 3.00%
61 రోజుల నుంచి 90 రోజులు- 3.00%
91 రోజుల నుంచి 120 రోజులు- 3.50%
121 రోజుల నుంచి 184 రోజులు- 3.50%
185 రోజుల నుంచి 210 రోజులు- 4.40%
211 రోజల నుంచి 270 రోజులు- 4.40%
271 రోజుల నుంచి 289 రోజులు- 4.40%
290 రోజుల నుంచి ఏడాది వరకు- 4.40%
ఏడాది నుంచి 389 రోజులు- 5.00%
390 రోజుల నుంచి 18 నెలలు- 5.00%
18 నెలల నుంచి రెండేళ్లు- 5.10%
రెండేళ్ల 1 రోజు నుంచి మూడేళ్లు- 5.15%
మూడేళ్ల 1రోజు నుంచి ఐదేళ్లు- 5.35%
ఐదేళ్ల 1 రోజు నుంచి పదేళ్లు- 5.50%
పదేళ్లు – గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు- 5.35%

పైన వివరించిన వడ్డీ రేట్లన్నీ సాధారణ ప్రజలకు వర్తిస్తాయి. వృద్ధులకు ఈ వడ్డీ రేట్ల కన్నా 0.50% అదనంగా వడ్డీని చెల్లిస్తాయి బ్యాంకులు.
Published by: Santhosh Kumar S
First published: September 11, 2020, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading