Fixed Deposits మీద ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

భారతీయులకు పొదుపుపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందుకే తాము సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సేవింగ్​ చేస్తుంటారు. అయితే, రిస్క్​ లేకుండా ఖచ్చితమైన రిటర్న్స్​ ఇచ్చే ఫిక్స్​డ్​ డిపాజిట్లలో పెట్టుబడికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.

  • Share this:
భారతీయులకు పొదుపుపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందుకే తాము సంపాదించే నెలవారీ ఆదాయం నుంచికొంత భాగాన్ని సేవింగ్​ చేస్తుంటారు. అయితే, రిస్క్​ లేకుండా ఖచ్చితమైన రిటర్న్స్​ ఇచ్చే ఫిక్స్​డ్​ డిపాజిట్(Fixed Deposits)లలో పెట్టుబడికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అనేక బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి.అయితే,వడ్డీ రేట్లు మాత్రం బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి.ఫిక్స్ డ్ డిపాజిట్ల ఆదాయంపై పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రైవేటు, స్మాల్ సేవింగ్ బ్యాంకులు (Banks) ఫిక్స్ డ్ డిపాజిట్లపై పన్ను రాయితీతో 6.75 శాతం వడ్డీ అందిస్తున్నాయి. పన్నులు చెల్లించే పని లేకుండా 6.75 శాతం వడ్డీ అందిస్తున్న బ్యాంకులు, వాటి వివరాలు చూద్దాం.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ( Suryoday Bank)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లపై పన్ను లేని అధిక వడ్డీలను అందిస్తోంది. ఈ బ్యాంకు అత్యధికంగా డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తోంది. లక్షన్నర మొత్తాన్ని ఐదు సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేస్తే ఈ బ్యాంకు మెచ్యూరిటీ తరవాత రూ.2.10 లక్షలు అందిస్తోంది.

యస్ బ్యాంకు ( YES BANK )
ఫిక్స్ డ్ డిపాజిట్లపై పన్నులేని 6.5 శాతం వడ్డీ ఆదాయం ఇచ్చే బ్యాంకుల్లో యస్ బ్యాంకు ( YES BANK) రెండో స్థానంలో ఉంది. ఈ బ్యాంకులో లక్షన్నర మొత్తాన్ని ఐదేళ్ల కాలానికి ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే రూ.2.07 లక్షలు చేతికి అందుతుంది.

ఆర్​బీఎల్ బ్యాంకు ( RBL Bank)
ఆర్​బీఎల్ బ్యాంకులో టాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 6.3 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదేళ్ల కాలవ్యవది కలిగిన లక్షన్నర డిపాజిట్ పై ఈ బ్యాంకు రూ.2.05 లక్షలు అందిస్తోంది.

డ్యుయిష్​ బ్యాంకు ( Deutsche Bank )
ఈ బ్యాంకు ఐదేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.25 శాతం పన్ను లేని వడ్డీ అందిస్తోంది. ఐదేళ్ల కాలానికి ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే రూ.2.05 లక్షలు పొందవచ్చు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ( Ujjivan Bank)
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లపై రూ.6.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదేళ్ల కాలానికి లక్షన్నర మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయిన తరవాత రూ.2.05 లక్షలు పొందవచ్చు.

Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

డిపాజిట్లకు భద్రత కల్పిస్తున్న క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్
స్మాల్ ప్రైవేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఐదు లక్షల వరకు డిపాజిట్లపైఆర్​బీఐ అనుబంధ సంస్థ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (Credit Guarantees Corporation) డిపాజిట్ బీమా కల్పిస్తోంది. లక్షన్నర వరకు డిపాజిట్లపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి ద్వారా పన్ను రాయితీ (Tax Exemption) పొందవచ్చు. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ మెచ్యూర్ కాకముందే తీసుకుంటే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Kishore Akkaladevi
First published: