Credit Card: క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలివే...

Card Protection Plan | ప్రయాణాల్లో కార్డులు, నగదు పోగొట్టుకుంటే బ్యాంకులు మీకు నగదును సర్దుబాటు చేస్తాయి. ఆ డబ్బును తిరిగి 28 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: October 22, 2019, 3:58 PM IST
Credit Card: క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలివే...
Credit Card: క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలివే... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 22, 2019, 3:58 PM IST
ఈ రోజుల్లో పేమెంట్స్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డుల్ని అందరూ వాడేస్తున్నారు. క్యాష్‌లెస్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కార్డు లావాదేవీలు తరచూ జరుపుతున్నట్టైతే మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇటీవల కాలంలో కార్డు మోసాలు బాగా పెరిగిపోయాయి. మీ కార్డు పోయినా, కార్డు వివరాలు ఇతరులకు దొరికినా మీ ఖాతా ఖాళీ కావడం మామూలే. ఇలాంటివాటి నుంచి మీకు రక్షణ కల్పిస్తుంటాయి కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్-CPP. కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను వేర్వేరు బ్యాంకులు అందిస్తుంటాయి. కార్డుల కారణంగా మీరు నష్టపోయే మొత్తానికి ఇవి రక్షణ కల్పిస్తుంటాయి. క్రెడిట్ కార్డులకే కాదు డెబిట్ కార్డులకూ ప్రొటెక్షన్ ప్లాన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు పాన్ కార్డ్, ఆధార్ కార్డులకు కూడా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ వర్తిస్తుంది. మీరు కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవాలంటే కంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఫీజు మారుతుంది. ప్లాన్ రేంజ్ రూ.900 నుంచి రూ.2200 మధ్య ఉంటుంది. ఇది వార్షికంగా మీరు చెల్లించే ఫీజు.

కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి క్లాసిక్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది బేసిక్ ప్లాన్. రెండోది ప్రీమియం కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది మిడ్ రేంజ్ ప్లాన్. మూడోది ప్లాటినమ్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది హైఎండ్ ప్లాన్. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి మీరు కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ తీసుకోవచ్చు. మీ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా ఆ తర్వాత జరిగే లావాదేవీల నుంచి రక్షణ కల్పిస్తుంది కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. అయితే కార్డు పోగొట్టుకున్న వెంటనే మీకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మీ ఫోన్‌లో టోల్ ఫ్రీ నెంబర్ సేవ్ చేసుకోవాలి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్యాంకు సిబ్బంది మీకు కార్డు జారీ చేసిన సంస్థను సంప్రదించి మీ కార్డుల్ని బ్లాక్ చేయిస్తారు. మీ ప్రయాణ టికెట్లు పోగొట్టుకున్నా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో మీ జర్నీ టికెట్లను రీప్లేస్ చేయించొచ్చు. ఇందుకోసం మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ హోటల్ బిల్లలుకూ ఇది వర్తిస్తుంది. అయితే గరిష్టంగా ఎంతవరకు పొందొచ్చు అన్నది మీరు తీసుకునే ప్లాన్‌ను బట్టి ఉంటుంది. విదేశాలకు వెళ్లినా కూడా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ వర్తిస్తుంది. ప్రయాణాల్లో కార్డులు, నగదు పోగొట్టుకుంటే బ్యాంకులు మీకు నగదును సర్దుబాటు చేస్తాయి. ఆ డబ్బును తిరిగి 28 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఎక్కువ కార్డులు ఉపయోగిస్తున్నట్టైతే కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. మీ కార్డులు పోయినట్టైతే మీరు అన్ని బ్యాంకుల కస్టమర్ కేర్‌కు కాల్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తున్న బ్యాంకుకు కాల్ చేస్తే చాలు. అన్ని కార్డులను బ్లాక్ చేయించే బాధ్యత వారిదే. తరచూ ప్రయాణించేవారికి, ఎక్కువగా కార్డులు ఉపయోగించేవారికి కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుంటా అండగా నిలుస్తుంది.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC: ఇండియన్ రైల్వే 2019 టికెట్ బుకింగ్ రూల్స్ ఇవే...
Loading...
SBI Card: ఇక కార్డు స్వైపింగ్ అవసరం లేదు... మొబైల్‌తో బిల్ పేమెంట్ ఈజీ

SBI Card: మీ దగ్గర ఎస్‌బీఐ కార్డు ఉందా? ఇన్స్యూరెన్స్ ఫ్రీ
First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...