హోమ్ /వార్తలు /బిజినెస్ /

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Recharge Plans | నెలకు 42 జీబీ మొబైల్ డేటా కావాలనుకునేవారికి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి.

  మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు, సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? రోజూ కనీసం 1.5 జీబీ డేటా వాడుతుంటారా? అయితే మీరు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి. రోజూ 1.5 జీబీ డేటా అంటే 28 రోజులకు 42 జీబీ డేటా ఉంటుంది. రిలయెన్స్ జియోలో అతి తక్కువగా రూ.199 ధరకే రీఛార్జ్ ప్లాన్ ఉండగా, ఎయిర్‌టెల్‌లో రూ.300 లోపు 2 ప్లాన్స్ ఉన్నాయి. వొడాఫోన్ ఐడియాలో మాత్రం రూ.300 ప్లాన్ తీసుకోవాలి. మరి ఏఏ ప్లాన్‌తో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

  Reliance Jio: రిలయెన్స్ జియోలో రూ.199 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1000 నిమిషాల కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

  Airtel: ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేసుకోవాలి. 28 రోజుల వేలిడిటీ. రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దాదాపు ఇవే బెనిఫిట్స్‌తో మరో ప్లాన్ కూడా ఉంది. రూ.279 రీఛార్జ్ చేసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ నుంచి రూ.4 లక్షల బీమా లభిస్తుంది.

  Vodafone Idea: వొడాఫోన్ ఐడియాలో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. కానీ ప్రస్తుతం ఇదే ప్లాన్‌పై డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది వొడాఫోన్ ఐడియా. అంటే రోజుకు 3జీబీ డేటా అందిస్తోంది.

  ఇవి కూడా చదవండి:

  Good News: ఈ స్కీమ్స్‌లో సేవింగ్స్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్

  JioPOS Lite App: ఈ జియో యాప్‌తో మీరూ డబ్బులు సంపాదించొచ్చు

  Prepaid Plans: రోజుకు 3 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, IDEA, Jio, Reliance Jio, VODAFONE, Vodafone Idea

  ఉత్తమ కథలు