భారత టెలికాం కంపెనీలు అతి తక్కువ ధరలకే కస్టమర్లకు డేటాను, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో కస్టమర్లు తమకు నచ్చిన, మంచి ప్రయోజనాలను అందిస్తున్న నెట్‌వర్క్‌లను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, పాత కస్టమర్లు వేరే నెట్‌వర్క్‌లకు మారకుండా ఉండటానికి వివిధ సంస్థలు ఎప్పటికప్పుడూ కొత్త టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. వీటిల్లో కొన్ని సక్సెస్ అవ్వగా, మరికొన్ని ప్లాన్లకు ఆధరణ కరవవుతోంది. గత ఏడాది ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలు వినియోగదారుల కోసం ఎన్నో కొత్త టారిఫ్‌లను ప్రకటించాయి. ఒకే సంస్థ నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్లలో కొన్నింటికి మంచి ఆధరణ లభిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను పొందే ప్లాన్లనే కస్టమర్లు ఎంచుకుంటున్నారు. ఆ టారిఫ్‌ల వివరాలను పరిశీలిద్దాం.
ఎయిర్టెల్ రూ.349 ప్లాన్‌తో రీఛార్జ్ చేయించుకున్న కస్టమర్లు రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMSలను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజులు. కానీ దాదాపు ఇలాంటి ప్రయోజనాలే ఉండే మరో రీఛార్జ్ టారిఫ్‌ను ఎయిర్టెల్ ప్రకటించింది. రూ.298 ప్లాన్‌తో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా లభిస్తోంది. దీంతో ఈ ప్టాన్నే ఎక్కువమంది ఎంచుకుంటున్నారు.
Prepaid Plans: రూ.250 లోపు Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే...
Samsung Galaxy M02s: కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర రూ.10,000 లోపే
రిలయన్స్ జియో ఒక్క రూపాయి తేడాతో రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిల్లో రూ.598 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. దీని ద్వారా కస్టమర్లు మొత్తం 112GB డేటాతో పాటు జియో అందించే స్ట్రీమింగ్ సర్వీసులకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. కానీ ఈ ప్లాన్‌ను కస్టమర్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోలిస్తే రూ.599 టారిఫ్‌తో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో, రోజుకు 2GB చొప్పున మొత్తం 168GB డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు. దీంతో ఇదే ప్లాన్‌ను ఎక్కువమంది వినియోగదారులు ఎంచుకుంటున్నారు.
ఎయిర్టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.289 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారులకు 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. కానీ ఈ ప్లాన్‌తో పోలిస్తే రూ.279 టారిఫ్ ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. దీనిద్వారా కాస్త తక్కువ ధరతో 28 రోజుల వరకు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5GB డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు.
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... రోజుకు రూపాయితో కొత్త ప్లాన్
Realme Days Sale: రియల్మీ స్మార్ట్ఫోన్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్
ఎయిర్టెల్ రూ.2,698 యాన్యువల్ ప్లాన్‌తో రీఛార్జ్ చేయించుకున్న కస్టమర్లు 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాను వాడుకోవచ్చు. కానీ దీంతో పోలిస్తే తక్కువ ధరలో లభించే మరో యాన్యువల్ ప్లాన్ ద్వారా కస్టమర్లు లబ్ధి పొందవచ్చు. రూ.2,498 ప్లాన్‌ను ఎంచుకున్నవారు కూడా 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను పొదవచ్చు.
ఎయిర్టెల్ నుంచి వచ్చిన రూ.448 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. దీని ద్వారా కస్టమర్లు రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. కానీ దాదాపు ఇలాంటి ప్రయోజనాలనే రూ.398 ప్లాన్‌తో పొందవచ్చు. ఈ టారిఫ్‌ను ఎంచుకున్నవారికి 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 3GB డేటా లభిస్తుంది.
Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా
LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే
వోడాఫోన్ ఐడియా ప్రకటించిన రూ.819 ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 2GB డేటాను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 84 రోజులు. ఇంతకంటే తక్కువ ధరలో లభించే రూ.795 ప్లాన్‌తో కూడా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చిన రూ.199 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని ఎంచుకున్న కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1GB డేటా లభిస్తుంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ రూ.187 ప్లాన్‌తో ఇంకా మంచి ప్రయోజనాలను అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటాను పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, BSNL, Jio, Reliance Jio, Vodafone Idea