Credit Card: ఫెస్టివల్ సీజన్‌లో క్రెడిట్ కార్డ్ వాడితే వచ్చే బెనిఫిట్స్ ఇవే

Credit Card Benefits | మీరు ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌తో వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: October 22, 2020, 1:21 PM IST
Credit Card: ఫెస్టివల్ సీజన్‌లో క్రెడిట్ కార్డ్ వాడితే వచ్చే బెనిఫిట్స్ ఇవే
Credit Card: ఫెస్టివల్ సీజన్‌లో క్రెడిట్ కార్డ్ వాడితే వచ్చే బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పండగొచ్చిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. బంధువులు, కుటుంబ సభ్యులతో అంతా కోలాహాలంగా ఉంటుంది. అంతే కాదు పండగ సీజన్ వచ్చేందంటే షాపింగ్ చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. తమకు ఇష్టమైన వారికి బహుమతులు అందజేయడం లాంటివి చేస్తుంటారు. అందుకే బ్యాంకులు కూడా తక్కువ వడ్డీలకే వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డులపై కూడా మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరి పండగ సీజన్ లో క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడం, రుణాలు తీసుకోవడం, లోన్లు చెల్లించడం లాంటివి ఎలాంటి రుణంపైన అయిన క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. రుణాల మాదిరిగా కాకుడా మీరు మీ బిల్లులను గడువు తేదీకి పూర్తిగా తిరిగి చెల్లించేంత వరకు క్రెడిట్ కార్డు వాడకం వడ్డీ రేటును కలిగి ఉండదు. ఇది క్రెడిట్ కార్డులను మీ క్రెడిట్ స్కోరును రూపొందించడానికి అత్యంత అనుకూలమైన ఖర్చుతో కూడుకున్న మార్గాలతో ఒకటిగా చేస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా మీ క్రెడిట్ మీ పరిమితిలో 30 శాతం మించి ఖర్చు చేయకుండా ఉండాలి. అలా చేయకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. భవిష్యత్ రుణం దాపు 30 నుంచి 49 శాతం పైనాన్స్ ఛార్జీలు క్రెడిట్ కార్డు అర్హతపై దెబ్బతీస్తుంది.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

క్రెడిట్ కార్డు ప్రయోజనాల ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చు


పండగ సీజన్ లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు చాలా మంది వ్యాపారులు, చిల్లర దుకాణాదారులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై అధిక రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు, వోచర్లు, క్యాష్ బ్యాక్ తదితర క్రెడిట్ కార్డు లావాదేవీలు లాంటి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తారు. మీరు మీ క్రెడిట్ కార్డు ఆఫర్ విభాగాన్ని తప్పక సందర్శించాలి. రిటైల్ అవుట్ లెట్లు లేదా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో శోధించాలి. అక్కడ అలాంటి తగ్గింపులు, క్యాష్ బ్యాక్ లు చెల్లుతాయి. మీరు అలాంటి ఆఫర్ లు కనుగొనలేకపోయినప్పటికీ, పండగ ఖర్చు కోసం మీ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం సాధారణ రివార్డు పాయింట్లు పొందుతారు. పండగ కొనుగోళ్లు చేసేటప్పుడు మీ రివార్డు పాయింట్లను ప్రయత్నించండి. వాటిని రిడీమ్ చేయండి.

వడ్డీ లేని కాలంలో నగదు ప్రవాహ నిర్వహణ


వడ్డీ లేని కాలంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు తేదీ, బిల్లింగ్ సైకిల్ గడువు తేదీ మధ్యకాల వ్యవధిని సూచిస్తుంది. వడ్డీ లేని వ్యవధిలో క్రెడిట్ కార్డు జారీ చేసేవారు లావాదేవీలపై ఎలాంటి వడ్డీలు వసూలు చేయరు. మీ క్రెడిట్ కార్డు బకాయిలు గడువు తేదీ పూర్తయే నాటికి తిరిగి చెల్లించగలుగుతారు. మీ లావాదేవీల తేదీల ఆధారంగా వడ్డీ లేని సమయం 18 నుంచి 55 రోజుల మధ్య ఉంటుంది. అందువల్ల క్రెడిట్ కార్డు జారీచేసే వారు మీ లావాదేవీలకు ఉచితకంగా ఆర్థిక సహాయం చేస్తారు. ఇది మీకు వడ్డీ ప్రయోజనం సంపాదించడానికి సహాయపడుతుంది. ఎక్కువ కార్డులు ఉన్నవారు చాలా క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చ చేయాలి. ఆ ఖర్చులో ప్రతి ఒక్కరికి గరిష్ఠ వడ్డీ లేని వ్యవధిని పొందగలుగుతారు.

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఈఎంఐల రూపంలో మార్చుకునే ఆప్షన్


పండగ సీజన్ లో క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేయడం చాలా సాధారణం. ఈ పరిస్థితిని నిర్వహించడానికి ఉత్తమ మార్గం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి పూర్తి లేదా క్రెడిట్ కార్డు బిల్లులో కొంత భాగాన్ని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈఎంఐ మార్పిడి 5 ఏళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. కార్డుదారులు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి తక్కువ ఖర్చుతో బకాయిలను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించడానికి ఇది అనుమతిస్తుంది.

నో కాస్ట్ ఈఎంఐ లభ్యత


క్రెడిట్ కార్డు జారీ చేసే చాలా సంస్థలు సేవల, వస్తువులపై ఖర్చులేని ఈఎంఐలను అందించడానికి వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఛానెల్లో ఈఎంఐ ఎంపికలు అందిస్తారు. నో కాస్ట్ ఈఎంఐలపై వడ్డీ ఖర్చులు వ్యాపారులు భరిస్తారు. అయితే కార్డుదారులు ఈఎంఐల ద్వారా కొనుగోళ్ల ఖర్చును భరించాల్సి ఉంటుంది. వ్యాపారులతో ఒప్పందం కదుర్చుకోవడం వల్ల కార్డు జారీచేసే వారు.. క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఖర్చులేని ఈఎంఐల ద్వారా కొనుగోళ్లు చేయడానికి అదనపు తగ్గింపులను ఇస్తారు.

తక్షణ నిధుల అవసరాలకు ముందస్తుగా ఆమోదించిన రుణాలు


రుణాలు తిరిగి చెల్లించేంత లావాదేవి ట్రాక్ రికార్డు ఉన్న కార్డుదారులకు సాధారణంగా వారు కార్డు జారీచేసేవారికి క్రెడిట్ కార్డుకు వ్యతిరేకంగా రుణం ఇస్తారు. ఇవి కార్డుదారుల క్రెడిట్ కార్డు పరిమితులకు వ్యతిరేకంగా మంజూరు చేసిన ముందస్తు అనుమతి పొందిన రుణాలు. రుణాల ప్రీ అప్రూవ్డ్ స్వభావం అన్ని క్రెడిట్ కార్డు ఎంపికల్లో వేగంగా పంపిణీ చేయడానికి దారితీస్తుంది. క్రెడిట్ కార్డు సంస్థలు కార్డు హోల్డర్లకు అదనపు క్రెడిట్ సదుపాయాలను కూడా అందిస్తారు. రుణం మొత్తం వారి మంజూరు చేసిన క్రెడిట్ కార్డు పరిమితికి మించి ఉంటుంది. ముందుస్తుగా ఆమోదించిన రుణాల లభ్యత పండగ ఖర్చుల కోసం ఎదుర్కొంటున్న ఆర్థిక కొరతను పరిష్కరించడానికి కార్డుదారులకు తక్షణ క్రెడిట్ అవసరాలను అందిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: October 22, 2020, 1:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading