news18-telugu
Updated: April 11, 2019, 5:48 PM IST
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌తో లాభాలివే...
ఇండియా పోస్ట్... భారతదేశంలో గ్రామగ్రామాన విస్తరించిన పోస్టల్ సర్వీస్. పట్టణాల కంటే పల్లెల్లో పోస్ట్ ఆఫీస్ సేవల్ని ఉపయోగించుకునేవాళ్లే ఎక్కువ. పోస్ట్ ఆఫీస్‌లో అన్ని వర్గాలకు వేర్వేరు పథకాలు ఉంటాయి. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మంచి వడ్డీ ఇస్తుంది ప్రభుత్వం. ఈ వడ్డీ రేట్లు మూడు నెలలకోసారి మారుతుంటాయి. అలాంటి పథకాల్లో ఇండియా పోస్ట్‌లో టైమ్ డిపాజిట్ పేరుతో ఓ స్కీమ్ ఉంది. దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అని కూడా అంటారు. పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌తో లాభాలేంటో తెలుసుకోండి.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌తో లాభాలు ఇవే...
పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎవరైనా క్యాష్ లేదా చెక్‌తో ఓపెన్ చేయొచ్చు.
కనీసం రూ.200 నుంచి ఈ అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు.
ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి 7 నుంచి 7.8 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.
ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్-7.00%
రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్-7.00%మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్-7.00%
ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్-7.80%
ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఎంచుకుంటే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
మైనర్ పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
నామినేషన్ సదుపాయం కూడా ఉంటుంది.
Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
ఇవి కూడా చదవండి:
SBI Card: ఈ 12 గోల్డెన్ రూల్స్‌తో మీ ఎస్బీఐ కార్డ్ సేఫ్
LIC Policy: రోజుకు రూ.206 పొదుపుతో 20 ఏళ్లలో రూ.27 లక్షలు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగం... రూ.41,000 జీతం... నేరుగా ఇంటర్వ్యూ
Published by:
Santhosh Kumar S
First published:
April 11, 2019, 5:48 PM IST