Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం

Post Office Monthly Income Scheme | రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును పొదుపు చేసి ప్రతీ నెలా వడ్డీ పొందాలనుకునేవారికి ఎంతో ఉపయోగకరమైన పథకం ఇది. ఇటీవలే ఈ స్కీమ్ వడ్డీ రేట్లు కూడా మారాయి. మరి ఈ స్కీమ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? వడ్డీ ఎంత వస్తుంది? లాంటి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 29, 2019, 3:14 PM IST
Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం
Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం
news18-telugu
Updated: July 29, 2019, 3:14 PM IST
పోస్ట్ ఆఫీస్... కేవలం పోస్టల్ సేవలు పొందడం మాత్రమే కాదు... ఎన్నెన్నో పొదుపు పథకాలనూ పొందొచ్చు. కేవలం పల్లెల్లోనే కాదు... పట్టణాల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లో డబ్బు పొదుపు చేసేవాళ్లున్నారు. ఇలాంటివారి కోసం అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తోంది ఇండియా పోస్ట్. అలాంటి పథకాల్లో ఒకటి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. అంటే నెలనెలా ఆదాయం పొందే పథకం అని అర్థం. ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినవాళ్లు నెలనెలా వడ్డీ పొందొచ్చు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును పొదుపు చేసి ప్రతీ నెలా వడ్డీ పొందాలనుకునేవారికి ఎంతో ఉపయోగకరమైన పథకం ఇది. ఇటీవలే ఈ స్కీమ్ వడ్డీ రేట్లు కూడా మారాయి. మరి ఈ స్కీమ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? వడ్డీ ఎంత వస్తుంది? లాంటి వివరాలు తెలుసుకోండి.

Post Office Monthly Income Scheme: మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వివరాలివే...


పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరు మీద కూడా అకౌంట్ తెరవచ్చు. 10 ఏళ్లు దాటిన మైనర్ అయితే అకౌంట్‌ను సొంతగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు అకౌంట్‌లో సమాన వాటా లభిస్తుంది. సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా, జాయింట్ అకౌంట్‌ను సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఈ అకౌంట్‍కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది. మీరు ఒక పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తెరిస్తే మరో పోస్ట్ ఆఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ.4.5 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో 2019 జూలై 1 నుంచి నెలకూ 7.6​% వడ్డీ ఇస్తోంది ఇండియా పోస్ట్. వడ్డీ నెలనెలా సేవింగ్స్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. కనీసం ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత 3 ఏళ్ల లోపు డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే 2%, మూడేళ్ల తర్వాత ఐదేళ్ల లోపు తీసుకుంటే 1% తక్కువగా డబ్బులు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఈ స్కీమ్‌కు ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను లాభాలు పొందొచ్చు.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:
Loading...
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆగస్ట్ 1 నుంచి ఈ ఛార్జీలు ఉండవు

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...

Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... ప్రారంభమైన రిజిస్ట్రేషన్
First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...