ఆటో స్వీప్... బ్యాంకు ఖాతాలో ఉండే సదుపాయం ఇది. చాలామందికి దీని గురించి తెలియదు. మీ అకౌంట్‌లో ఉండే డబ్బుకు బ్యాంకులు 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ మాత్రమే ఇస్తాయి. అకౌంట్‌లో డబ్బులపై మీకు ఇంకా ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు ఉపయోగపడేదే ఆటో స్వీప్ ఫెసిలిటీ. దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాడుకుంటే మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. మరి ఆటో స్వీప్ అంటే ఏంటీ? దాని వల్ల లాభమేంటీ? నష్టాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకోండి.
Read this: Election 2019: కొత్త ఇంటికి మారారా? ఓటర్ ఐడీలో అడ్రస్ ఇలా మార్చుకోండి
మీ అకౌంట్‌లో మీ అవసరానికి మించి ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించి ఎక్కువ వడ్డీ పొందేందుకు ఉపయోగపడేదే ఆటో స్వీప్ సదుపాయం. ఉదాహరణకు మీ అకౌంట్‌లో రూ.1 లక్ష ఉన్నాయనుకోండి, అందులో మీరు రూ.20,000 మాత్రమే వాడుకోవాలనుకుంటే మిగతా రూ.80,000 ఆటో స్వీప్ ఫెసిలిటీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించొచ్చు. అప్పుడు మీ అకౌంట్ రూ.20,000 మాత్రమే ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి వెళ్లిన డబ్బుపై మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇలా మీరు రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించొచ్చు. అయితే మీకు డబ్బులు అవసరమైతే వెంటనే డ్రా చేసుకోవచ్చు కూడా.
Read this: Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
అకౌంట్‌లో చాలాకాలంగా ఎక్కువ డబ్బులు ఉన్నవారికి మాత్రమే ఆటో స్వీప్ ఉపయోగపడుతుంది. అంటే కొన్ని నెలల పాటు కొంత మొత్తం అవసరం లేదనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించొచ్చు. ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంది కదా అని పదేపదే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోంచి డబ్బులు డ్రా చేస్తే మీకు ఎక్కువగా వడ్డీ ఏమీ రాదు. ఎందుకంటే వడ్డీని ఏడాదికి లెక్కిస్తారు. మీరు 40 రోజులకో 50 రోజులకో డబ్బులు డ్రా చేస్తే వడ్డీ అన్ని రోజులకే లెక్కిస్తారు. దీంతో మీకు పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. కనీసం 30 రోజులు అయినా మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంచాలన్న నిబంధనలు కొన్ని బ్యాంకుల్లో ఉన్నాయి. మీరు అంతలోపు డ్రా చేస్తే ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ పెనాల్టీ కూడా చెల్లించాల్సి వస్తుంది.
ఆటో స్వీప్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి Last In First Out (Lifo). అంటే దీర్ఘకాలం ఎఫ్‌డీలో డబ్బులు జమ చేసేవారికి ఉపయోగపడే పద్ధతి ఇది. వారికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఒకవేళ మీరు తరచూ డబ్బులు తీస్తూ ఉంటే First In First Out (Fifo) ఎంచుకోవాలి. అందుకే ఆటో స్వీప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ ఫెసిలిటీ ఎంచుకోవడం మంచిది. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఆటో స్వీప్ ద్వారా గరిష్టంగా 8% వరకు వడ్డీ పొందొచ్చు.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking, Personal Finance, Save Money