హోమ్ /వార్తలు /బిజినెస్ /

AIS: యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ ఇప్పుడు చాలా అవసరం.. ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కు ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే..?

AIS: యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ ఇప్పుడు చాలా అవసరం.. ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కు ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే..?

యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌తో ఎన్నో ఉపయోగాలు

యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌తో ఎన్నో ఉపయోగాలు

ఒక నిర్దిష్ట సంవత్సరానికి పన్ను చెల్లింపుదారుల వివరాలు పొందుపరిచే డాక్యుమెంట్‌ను యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(AIS) అంటారు. ఇందులో పన్ను చెల్లింపుదారుల ఆదాయాలు, వారి ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్ను ప్రొసీడింగ్‌లు, పన్ను వివరాలు, మరిన్నింటికి సంబంధించిన వివరాలు ఉంటాయి.

ఇంకా చదవండి ...

ఒక నిర్దిష్ట సంవత్సరానికి పన్ను చెల్లింపుదారుల వివరాలు పొందుపరిచే డాక్యుమెంట్‌ను యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(AIS) అంటారు. ఇందులో పన్ను చెల్లింపుదారుల ఆదాయాలు, వారి ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్ను ప్రొసీడింగ్‌లు, పన్ను వివరాలు, మరిన్నింటికి సంబంధించిన మొత్తం డేటా ఉంటుంది. యాన్యువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌లో ప్రభుత్వం ప్రతి ట్రాన్సాక్షన్‌ రిపోర్టెడ్‌ వ్యాల్యూ, మాడిఫైడ్‌ వ్యాల్యూను మెయింటెన్‌ చేస్తుంది. యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

* యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (AIS) అంటే ఏంటి?

యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ని ఆదాయ పన్ను శాఖ 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు నిర్వహించే అన్ని ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌ల డేటా ఉంటుంది. AIS అనేది తప్పనిసరిగా ఆదాయం, పెట్టుబడి, వ్యయం సహా 46 ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌ల వివరాలను పొందుపరిచే సమగ్ర ప్రకటన. అధికారులు తప్పనిసరిగా ఈ డేటాను ఫారమ్ 26ASలో పన్ను చెల్లింపుదారుల రిజిస్టర్డ్ ఖాతాలో అప్‌లోడ్ చేయాలి.

* యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ లక్ష్యాలు

- ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే సమయంలో AIS పూర్తి సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుకు చూపుతుంది.

- AIS వాలంటరీ కాంప్లియన్స్‌ ప్రోత్సహిస్తుందని, ITRని ముందస్తుగా దాఖలు చేసేలా సహకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

- AIS పన్ను చెల్లింపుదారుల నుంచి వర్తించని అంశాలను గుర్తించి, అడ్డుకుంటుంది.

* AIS ఏ రకమైన సమాచారాన్ని చూపుతుంది?

యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ సమాచారం కోసం ఫారమ్ నం.26AS పై దృష్టి పెడుతుంది. ఇది కింద పేర్కొన్న సమాచారానికి సంబంధించినది కావచ్చు:

TDS, TCS సమాచారం: TDS/ TCS సమాచార విలువ, సమాచార వివరణ AISలో చేరుస్తారు.

స్సెసిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌(SFT): SFT కోడ్, సమాచార విలువ, సమాచార వివరణ సహా SFT కింద రిపోర్టింగ్ ఎంటిటీలను AISలో చూడవచ్చు.

పన్ను చెల్లింపు: సెల్ఫ్‌-అసెస్‌మెంట్ పన్ను, ముందస్తు పన్ను వంటి మొత్తం పన్ను చెల్లింపు డేటా AISలో అందుబాటులో ఉంటుంది.

రీఫండ్‌, డిమాండ్: రీఫండ్‌ ఇనిషియేట్‌ చేసిన సమాచారం, పెరిగిన డిమాండ్, ఆర్థిక సంవత్సరంలో పెరిగిన సమాచారం AISలో అందిస్తారు.

ఇతర సమాచారం: రీఫండ్‌పై వడ్డీ, విదేశీ కరెన్సీ కొనుగోలు, అనుబంధం-II జీతం మొదలైన వాటి సమాచారం కూడా AISలో ఉంటుంది.

ఇదీ చదవండి: ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం.. ఏకంగా హ్యాకర్లను దించుతోంది! చదివితే ఆశ్చర్యపోతారు..


* AIS ఫీచర్స్‌

AIS వడ్డీ, డివిడెండ్, సెక్యూరిటీల లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు, విదేశీ చెల్లింపుల సమాచారం మొదలైన కొత్త సమాచారాన్ని కలిగి ఉంది. AIS సమాచారం.. ట్యాక్స్‌ పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(TIS)లో రిటర్న్‌ను సులభంగా దాఖలు చేయడం కోసం అందిస్తుంది. పన్ను చెల్లింపుదారులు AIS సమాచారంపై ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించగలరు. PDF, JSON, CSV వంటి మల్టిపుల్‌ ఫార్మాట్‌లలో సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. AIS యుటిలిటీ పన్ను చెల్లింపుదారులు AISని చూడటానికి, ఆఫ్‌లైన్‌లో ఫీడ్‌బ్యాక్‌ అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

* AISని ఎలా తనిఖీ చేయాలి?

- www.incometax.gov.inలో ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయ్యి, సర్వీసెస్ మెనూలో యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

- ప్రొసీడ్‌ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, కాంప్లియన్స్‌ పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది.

- AIS హోమ్ పేజీలో ట్యాక్స్‌ పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (TIS), యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(AIS) చూడవచ్చు.

- సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని సెలక్ట్‌ చేసుకున్న తర్వాత, సంబంధిత టైల్స్‌పై క్లిక్ చేసి, ట్యాక్స్‌ పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (TIS), యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(AIS) చూడవచ్చు.

- TIS స్క్రీన్‌షాట్‌ను చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి AIS, TISని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TISని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అయితే AISని PDF, CSV లేదా JSON ఫార్మాట్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

PDF ఫైల్ పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌తో ఉంటుంది. పాస్‌వర్డ్ అనేది PAN, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు పుట్టిన తేదీ లేదా పన్ను చెల్లింపుదారు ఇన్‌కార్పొరేషన్ తేదీ కలయికతో ఉంటుంది.

First published:

Tags: Income tax, IT Returns, Taxes, Tds

ఉత్తమ కథలు