హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Coins: గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? బంగారు నాణేలతో లాభమా... నష్టమా... తెలుసుకోండి

Gold Coins: గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? బంగారు నాణేలతో లాభమా... నష్టమా... తెలుసుకోండి

Gold Coins: గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? బంగారు నాణేలతో లాభమా... నష్టమా... తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Coins: గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? బంగారు నాణేలతో లాభమా... నష్టమా... తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Gold Coins | గోల్డ్ కాయిన్ కొంటున్నారా? గోల్డ్ కాయిన్ కొనేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం అవసరం. గోల్డ్ కాయిన్‌తో లాభమెంతో, నష్టాలేంటో తెలుసుకోండి.

బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నగలు కొనొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ బార్స్ కొనొచ్చు. లేదా గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా ఎక్కువ మంది గోల్డ్ కాయిన్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినవాళ్లు కూడా కొంతకాలం తర్వాత రీడీమ్ చేసుకొని కాయిన్స్‌గా మార్చుకుంటారు. మరి ఈ గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభముందా? లేక నష్టమా? గోల్డ్స్ కాయిన్స్ కొని ఇంట్లో దాచుకుంటే భవిష్యత్తులో లాభపడతారా? లేక నష్టపోతారా? తెలుసుకోండి.

బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉన్న ఆప్షన్లలో గోల్డ్ కాయిన్స్ ఒకటి. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో బహుమతులుగా ఇచ్చేందుకు గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటారు. గోల్డ్ కాయిన్స్‌ను నగల దుకాణంలో కొనొచ్చు లేదా బ్యాంకుల్లో కూడా తీసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ సైట్లలో కూడా గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు. ఈ గోల్డ్ కాయిన్స్ ఒక గ్రాము నుంచి లభిస్తాయి. మార్కెట్ ధరను బట్టి గోల్డ్ కాయిన్స్ ధరలు ఉంటాయి. డబ్బులు ఉంటే గోల్డ్ కాయిన్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. గోల్డ్ కాయిన్స్ బ్యాంకుల నుంచి లేదా ప్రముఖ నగల దుకాణాల నుంచే కొనడం మంచిది. చిన్నచిన్న షాపుల్లో కొంటే స్వచ్ఛత విషయంలో మోసపోయే అవకాశం ఉంది. బ్యాంకుల్లో, ప్రముఖ దుకాణాల్లో కొంటే ఫుల్ రీసేల్ వ్యాల్యూ ఉంటుంది.

IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

Prepaid Plans: 84 రోజుల వేలిడిటీతో Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

గోల్డ్ కాయిన్స్‌ని ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మొచ్చు. సులువుగా అమ్మగలిగే అవకాశం ఉంటుంది కాబట్టే గోల్డ్ కాయిన్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీరు గోల్డ్ కాయిన్స్ కొని భవిష్యత్తులో ఎక్కువ రేటుకు అమ్మితే వచ్చిన లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినట్టైతే గోల్డ్ కాయిన్‌గా మార్చడానికి మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేకింగ్ ఛార్జీలు సంస్థను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అందుకే గోల్డ్ కాయిన్స్ కొనేముందు ఈ మేకింగ్ ఛార్జీలను దృష్టిలో పెట్టుకోవాలి.

గోల్డ్ కాయిన్స్ కొన్నాక ఒకవేళ తాకట్టు పెట్టాలంటే సమస్యలు రావొచ్చు. ఎందుకంటే మీరు బయట ప్రైవేట్ జ్యువెలరీ సంస్థల్లో కొన్న గోల్డ్ కాయిన్స్‌ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం సాధ్యం కాదు. బ్యాంకుల దగ్గర కొన్న గోల్డ్ కాయిన్స్‌నే మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టొచ్చు. అయితే మార్కెట్‌లో లభించే గోల్డ్ కాయిన్స్ కన్నా బ్యాంకుల్లో దొరికే గోల్డ్ కాయిన్స్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు గోల్డ్ కాయిన్స్ కొంటే వాటిని భద్రపర్చడం కూడా రిస్కే. బ్యాంకు లాకర్లలోనే సేఫ్‌గా దాచుకోగలరు.

SBI Personal Loan: కేవలం 4 క్లిక్స్‌తో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... అప్లై చేయండి ఇలా

EPF Account Update: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ మార్చండి చేయండి ఇలా

కేవలం పెట్టుబడి కోసమే గోల్డ్ కాయిన్స్ కొనాలనుకునేవారు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటి ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. గోల్డ్ డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భద్రపర్చుకోవాలన్న రిస్క్ ఉండదు. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Investment Plans, Personal Finance, Silver rates

ఉత్తమ కథలు