Credit Card: క్రెడిట్ కార్డులో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా?

Credit Card Tips | క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడానికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని క్రెడిట్ కార్డులపై ఉచితంగా క్రెడిట్ స్కోర్ పొందే అవకాశం ఉంటుంది.

news18-telugu
Updated: June 8, 2019, 4:10 PM IST
Credit Card: క్రెడిట్ కార్డులో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా?
Credit Card: క్రెడిట్ కార్డులో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 8, 2019, 4:10 PM IST
మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? క్రెడిట్ కార్డులోని ఫీచర్లను మొత్తం ఉపయోగించుకుంటున్నారా? అసలు క్రెడిట్ కార్డులో ఏఏ ఫీచర్లు ఉంటాయో కూడా పూర్తిగా అవగాహన లేదా? మీ క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా తెలుసుకుంటేనే సమర్థవంతంగా వాడుకోగలరు. వడ్డీ లేని రుణం, నెలనెలా కొత్త రీపేమెంట్ సైకిల్, మినిమమ్ బ్యాలెన్స్ పేమెంట్ లాంటి ఫీచర్లు దాదాపు అందరికీ తెలిసినవే. కానీ ఇంకా కొన్ని ఫీచర్లుంటాయి. వాటిని వాడుకుంటే మీకు అదనంగా లాభం చేకూరుతుంది. ఇంట్రడక్టరీ ఆఫర్స్, రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, ఫ్లాట్ డిస్కౌంట్స్, ఫ్రీ మూవీ టికెట్స్, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌‌లో కాంప్లిమెంటరీ యాక్సెస్... ఇలా ప్రతీ కార్డుపై అదనపు ప్రయోజనాలుంటాయి. మరి వాటి గురించి వివరంగా తెలుసుకోండి. మీ క్రెడిట్ కార్డును ఇప్పటి నుంచి సమర్థవంతంగా వాడుకోండి.

1. ఇంట్రడక్టరీ ఆఫర్స్


మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్న ప్రారంభ ఆఫర్స్ చాలా ఉంటాయి. గిఫ్ట్ కూపన్స్, షాపింగ్ కూపన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు. వాటిని షాపింగ్, ట్రావెల్ లాంటి వాటికోసం ఉపయోగించుకోవచ్చు. కొన్ని కార్డులపై సుమారు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు గిఫ్ట్ కూపన్స్ లభిస్తాయి. వాటిలో మీరు మొత్తం ఉపయోగించుకోకపోయినా కొన్ని కూపన్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడేవే.

2. ఉచితంగా క్రెడిట్ స్కోర్


మీ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుసుకోవాలంటే రేటింగ్ ఇచ్చే కంపెనీలకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో ఎక్కువగా సిబిల్, ఎక్స్‌పీరియన్ క్రెడిట్ స్కోర్స్‌ను పరిగణలోకి తీసుకుంటాయి బ్యాంకులు. ఆరు నెలలకోసారి మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది. అయితే క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడానికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని క్రెడిట్ కార్డులపై ఉచితంగా క్రెడిట్ స్కోర్ పొందే అవకాశం ఉంటుంది.

3. రివార్డ్స్




మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే వచ్చే రివార్డ్ పాయింట్స్ మాత్రమే కాదు ట్రావెల్, డైనింగ్, మూవీ టికెట్స్ లాంటివాటికి అదనంగా డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. మీరు కొత్తగా ఏ వస్తువు కొనాలన్నా, ట్రావెల్ టికెట్ బుక్ చేయాలన్నా ముందుగా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుపై ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి.
Loading...

4. క్రెడిట్ కార్డ్‌పై ఇన్‌స్టంట్ లోన్


ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలా? పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసేంత టైమ్ లేదా? మీరు క్రెడిట్ కార్డుపై ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. కాకపోతే వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ... మీరున్న అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు సమకూరుతాయి. నిమిషాల్లో లోన్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. అయితే మీకు బ్యాంకు ఎంత ఇన్‌స్టంట్ లోన్ ఇస్తుందో కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

5. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్


ఒక క్రెడిట్ కార్డ్ నుంచి మరో క్రెడిట్ కార్డ్‌కు బ్యాలెన్స్ ట్రాన్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం అన్ని క్రెడిట్ కార్డులపై ఉండకపోవచ్చు. అందుకే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునే సమయంలో బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవాలి. మీ దగ్గర రెండుకార్డులు ఉంటే ఒక కార్డు నుంచి మరో కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా...

Budget 2019 : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు టాప్-10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

Cricket Score: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై లైవ్ క్రికెట్ స్కోర్... గూగుల్ స్పెషల్ ఫీచర్ ఇలా వాడుకోండి
First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...