Home /News /business /

KNOW ABOUT 5 BENEFITS OF EMPLOYEES PROVIDENT FUND EPF ACCOUNT SS GH

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

EPF: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

EPF: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

EPF Account | మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి తమకు లభించే బెనిఫిట్స్‌పై పూర్తిగా అవగాహన ఉండదు. ఈపీఎఫ్ అకౌంట్‌తో వచ్చే 5 ప్రధానమైన బెనిఫిట్స్ ఏవో తెలుసుకోండి.

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి పీఎఫ్ మాత్రమే కాదు అనేక లాభాలున్నాయి. ఈపీఎఫ్ఓ సంక్షిప్తంగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ. ఇది- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ప్రొవిజన్స్ యాక్ట్, 1952 చేత స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. భవిష్యత్ అవసరాల కొరకు ఈపీఎఫ్ ఖాతాలో ప్రతినెలా ఉద్యోగి జీతంలో నుంచి కొంత నగదు జమచేసుకోవచ్చు. దీనిలో ఈపీఎఫ్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న కంపెనీ ఉద్యోగులు మాత్రమే పెట్టుబడులు పెట్టగలరు. సంస్థ, ఉద్యోగి ప్రతినెలా 12 శాతం చొప్పున కొంత మేర దీనిలో పెట్టుబడి పెట్టి ఉద్యోగి అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే చాలా మంది ఉద్యోగులు ఈపీఎఫ్ కేవలం పదవీ విరమణ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగపడుతుందనే భావనలో ఉంటారు. ఈపీఎఫ్ నగదులను చాలా తేలికగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చో. పీఎఫ్ ప్రయోజనాలేంటే ఇప్పుడు తెలుసుకుందాం.

    Term Insurance: మీకు టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉందా? త్వరగా తీసుకుంటే లాభమిదే

    EPFO: స్వయం ఉపాధి పొందుతున్నారా? మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    పీఎఫ్ ఖాతాతో ముఖ్యమైన ఐదు ప్రయోజనాలు ఇవే


    1. ఈ పొదుపు పథకం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

    2. పీఎఫ్ చందాదారుడు మరణించినప్పుడు కుటుంబం భీమా పథకం 1976 (EDLI) ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. అతని కుటుంబ సభ్యులకు అతడు చివరి నెలలో అందుకున్న శాలరీకి 20 రెట్లు ఎక్కువ నగదు ఈపీఎఫ్ఓ అంజేస్తుంది. అయితే గరిష్టంగా రూ .6 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది.

    3. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ స్కీమ్–1995 (ఇపిఎస్) కింద జీవితకాల పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తుంది.

    4. ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి సభ్యుడికి అధిక రాబడి వస్తుంది. ఉద్యోగి జమ చేసిన నగదుకు వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, 1956 ప్రకారం ఏర్పడిన చట్టబద్ధమైన సంస్థ కాబట్టి దీనిలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఈపిఎఫ్ వడ్డీ రేటు ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ఓ ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ఇది 8.5 శాతంగా ఉంది.

    5. ప్రస్తుతం నెలకొన్ని కొవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు కొల్పోడంతో అనేక మంది నిరుద్యోగంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఊరట కలిగేలా ప్రభుత్వం వారికి పాక్షిక ఉపసంహరణ సదుపాయాన్ని కల్పించింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: BUSINESS NEWS, EPFO, Insurance, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు