KISAN VIKAS PATRA SCHEME KNOW ABOUT ELIGIBILITY INTEREST RATES AND OTHER TOP FEATURES SS GH
Kisan Vikas Patra: ఎక్కువ కాలం పొదుపు చేయాలా? ఈ స్కీమ్ మీ కోసమే
Kisan Vikas Patra: ఎక్కువ కాలం పొదుపు చేయాలా? ఈ స్కీమ్ మీ కోసమే
(ప్రతీకాత్మక చిత్రం)
Kisan Vikas Patra Scheme | మీరు ఎక్కువ రోజులు డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా? కిసాన్ వికాస్ పత్ర మీకు రిస్క్ లేని పెట్టుబడి. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.
అర్హత: కిసాన్ వికాస్ పత్రను ఎవరైనా ఒక వ్యక్తి లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి కొనుక్కోవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు కూడా వీటిని కొనుక్కోవచ్చు. మైనర్ లేదా మతిస్థితిమం సరిగ్గా లేని వ్యక్తుల తరఫున ఒక సంరక్షకుడు(గార్డియన్) వీటిని కొనొచ్చు.
ఎక్కడ కొనాలి?: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఎక్కడైనా వీటిని కొనుగోలు చేయవచ్చు.
వడ్డీ రేటు: కిసాన్ వికాస్ పత్రకి వర్తించే వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో వీటిపై వడ్డీని 6.9 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. KVP సర్టిఫికెట్లలో పెట్టుబడి పెట్టిన మొత్తం.. సుమారు 124 నెలల్లో(10 సంవత్సరాలు 4 నెలలు) రెట్టింపు అవుతుంది.
పెట్టుబడి పరిమితులు: కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో పెట్టుబడికి ఎలాంటి పరిమితులూ లేవు. రూ.100 గుణిజాలతో ఎంత మొత్తమైనా పెట్టుబడిగా పెట్టొచ్చు.
ఇతర ఉపయోగాలు: కిసాన్ వికాస్ పత్రలకు నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. వీటిని ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.