హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు... ప్రాసెస్ ఇదే

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు... ప్రాసెస్ ఇదే

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు... ప్రాసెస్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు... ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Kisan Credit Card | రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం బ్యాంకుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయొచ్చు. ప్రముఖ బ్యాంకులన్నీ ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్స్ స్వీకరిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుతో వ్యవసాయ రుణాలు (Agriculture Loans) తీసుకోవచ్చు. గడువులోగా రుణాలు చెల్లించేవారికి వడ్డీపై సబ్సిడీ కూడా ఉంటుంది. రైతులు గతంలో ఎక్కువగా రుణాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని అప్పులపాలయ్యేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు ఇప్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. వడ్డీ రేటు కూడా తక్కువ కావడంతో రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డుతో ప్రయోజనాలు


కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి రైతులు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసిన తర్వాత రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కార్డు మంజూరవుతుంది. వ్యక్తిగతంగా, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.3,00,000. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రైతులకు ఎక్కువ రుణాలు లభిస్తాయి. బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతుంది. కనీస వడ్డీ రేటు 7 శాతం మాత్రమే. వడ్డీపై 3 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఐదేళ్ల లోపు రుణాలు చెల్లించవచ్చు.
PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఒక్క రాష్ట్రంలోనే 21 లక్షల మంది అనర్హులు... వారి నుంచి డబ్బు రికవరీ
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌లో చేరినవారికి రూపే డెబిట్ కార్డ్ కూడా లభిస్తుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లిస్తే పంటలకు బీమా లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ , హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తాయి. రూ.25,000 క్రెడిట్ లిమిట్‌తో చెక్ బుక్ లభిస్తుంది. రైతులు లోన్ డబ్బుతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కొనొచ్చు.
Pension Scheme: త్వరలో ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ స్కీమ్... కనీస పెన్షన్ రూ.3,000


కిసాన్ క్రెడిట్ కార్డుకు ఆన్‌లైన్‌లో అప్లై చేయండిలా


Step 1- మీరు ఆ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఆ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3- పేరు, ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 4- ఆ తర్వాత రైతులు మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
Step 5- రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది.
Step 6- ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది నుంచి కాల్ వస్తుంది.
Step 7- ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit cards, Farmers, Personal Finance

ఉత్తమ కథలు